కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది.
హైదరాబాద్: కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ మేరకు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. శనివారం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.