నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి | GDP growth likely to be 6 3pc in FY25 says SBI report | Sakshi

నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి

Published Thu, Jan 9 2025 7:58 AM | Last Updated on Thu, Jan 9 2025 7:58 AM

GDP growth likely to be 6 3pc in FY25 says SBI report

న్యూఢిల్లీ: బలహీనమైన డిమాండ్‌ వంటి పలు కారణాల నేపథ్యంలో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పరిశోధనా నివేదిక పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (6.6 శాతం), జాతీయ గణాంకాల కార్యాలయం మొదటి  ముందస్తు అంచనాలు(6.4 శాతం), ఆర్థిక శాఖ తొలి అంచనా (7 శాతం) కన్నా ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా తక్కువగా ఉండడం గమనార్హం.

వ్యవస్థలో డిమాండ్‌ ధోరణులు బలహీనంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.  2020–21లో కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత 6.3 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది.  బేస్‌ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది.  2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్‌లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.  గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ రూపొందించిన ఈ నివేదికలోని  మరిన్ని ముఖ్యాంశాలు...

  • జీడీపీ వృద్ధిలో మందగమనం ఉన్నప్పటికీ తలసరి ఆదాయం 2023–24తో పోల్చితే, 2024–25లో రూ. 35,000 పెరిగే అవకాశం ఉంది.  

  • భారీ పెట్టుబడులుకు సంబంధించిన విభాగ ం– క్యాపిటల్‌ ఫార్మేషన్‌లో వృద్ధి రేటు 270 బేసిస్‌ పాయింట్లు (2.7%) 7.2 శాతానికి దిగిరానుంది.  

  • ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2024–25 జీడీపీలో 4.9 శాతంగా (బడ్జెట్‌ లక్ష్యం ప్రకారం) ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement