
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి.