Surface trough
-
మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యాయి. ప్రస్తుతం సాధారణస్థితిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న మూడురోజులు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 32 డిగ్రీ సెల్సీయస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
తీవ్ర అల్పపీడనం: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతవరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ(సోమవారం) ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేగాక దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని అధికారులు చెప్పారు. దీంతో తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న చత్తీష్‌గడ్ ప్రాంతాలలో 0.9కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన తీవ్ర అల్ఫపీడనం కారణంగా రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, కోమురంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్–పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురివగా బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
అల్ప పీడనం: మరో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతున్న అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక తదుపరి 42 గంటల్లోగా ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి రాగల మూడు రోజుల పాటు వర్ష సూచన తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు(బుధవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
ఏపీలో మరో 3 రోజులపాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వాతావరణ సూచన తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు(మంగళవారం, బుధవారం) ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఉపరితల ద్రోణి: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 13 °N అక్షాంశం వెంబడి ఉపరితల ద్రోణి 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు ప్రేర్కొంది. దీనివల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పక్కనే ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 5.8కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి, కోత జోన్‌తో కలసినట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరట్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(శుక్రవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. -
తెలంగాణ: రాగల 3 రోజుల్లో వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. దక్షిణ జార్ఖండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, ఇంటీరియర్ ఒరిస్సా నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతేగాక శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
తెలంగాణపై ఉపరితల ద్రోణి
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరట్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అలాగే సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈదురుగాలుల కారణంగా అనేకచోట్ల మామిడి కాయలు పడిపోయే ప్రమాదం ఉందని ఉద్యానశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా శనివారం ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. అలాగే మెదక్, నిజామాబాద్, రామగుండంలలో 41 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్‌లలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లో అల్లకల్లోలం
సాక్షి, హైదరాబాద్: సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. దాంతో ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు కొమ్మలు.. నేలకొరిగిన భారీ చెట్లు.. ఇదీ గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన సృష్టించిన అల్లకల్లోలం. మధ్యాహ్నం వరకు నిప్పులు కక్కిన సూర్యభగవానుడిని ఒక్కసారిగా మేఘాలు కప్పేశాయి. ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కమ్ముకొని కొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో కూడిన భారీ వర్షం నగరాన్ని వణికించింది. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లితో పాటు రాం నగర్, ఓయూ, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, సుల్తాన్‌బజార్, సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, మాదాపూర్, గచ్చిబౌలి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుషాయిగూడ, నాచారం, దమ్మాయిగూడతో పాటు పలు ప్రాంతాల్లో భీకరగాలులతో కుండబోత వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రానున్న మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఇదివరకే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ భారీగా కురిసిన వర్షంతో రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో అత్యవసర బృందాలను పంపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్క వర్షపు నీరు నిలబడటం, మరో పక్క మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరో మూడు రోజులపాటు వానలు
హైదరాబాద్ : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే దానికి అనుబంధంగా తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెదరాబాద్ వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. ఒకటి,రెండు చోట్ల ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రతీ వేసవి మార్చి, ఏప్రిల్ నెలల్లో క్యుములోనింబస్ మేఘాలు రావడం సహజమని.. దాని కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డాక యథావిధిగా ఎండల తీవ్రత పెరుగుతుందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. జూన్ రెండు లేదా మూడో వారం.. వచ్చే నెల ఒకటి,రెండు తేదీల్లో కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ తర్వాత రెండు లేదా మూడో వారంలో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.