హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rain Fall In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Published Thu, May 17 2018 4:43 PM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM

సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. దాంతో ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు కొమ్మలు.. నేలకొరిగిన భారీ చెట్లు.. ఇదీ గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన సృష్టించిన అల్లకల్లోలం. మధ్యాహ్నం వరకు నిప్పులు కక్కిన సూర్యభగవానుడిని ఒక్కసారిగా మేఘాలు కప్పేశాయి. ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కమ్ముకొని కొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో కూడిన భారీ వర్షం నగరాన్ని వణికించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement