windstorm
-
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
తెలంగాణలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
జమ్మలమడుగులో గాలివాన బీభత్సం
-
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లో అల్లకల్లోలం
సాక్షి, హైదరాబాద్: సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. దాంతో ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు కొమ్మలు.. నేలకొరిగిన భారీ చెట్లు.. ఇదీ గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన సృష్టించిన అల్లకల్లోలం. మధ్యాహ్నం వరకు నిప్పులు కక్కిన సూర్యభగవానుడిని ఒక్కసారిగా మేఘాలు కప్పేశాయి. ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కమ్ముకొని కొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో కూడిన భారీ వర్షం నగరాన్ని వణికించింది. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లితో పాటు రాం నగర్, ఓయూ, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, సుల్తాన్‌బజార్, సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, మాదాపూర్, గచ్చిబౌలి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుషాయిగూడ, నాచారం, దమ్మాయిగూడతో పాటు పలు ప్రాంతాల్లో భీకరగాలులతో కుండబోత వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రానున్న మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఇదివరకే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ భారీగా కురిసిన వర్షంతో రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో అత్యవసర బృందాలను పంపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్క వర్షపు నీరు నిలబడటం, మరో పక్క మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాకిస్తాన్లో తుఫాను.. 35మంది మృతి
ఇస్లామాబాద్ : ఉత్తర, ఈశాన్య భారతంలో భూకంపం కల్లోలం సృష్టిస్తే , పాకిస్తాన్లో తుఫాను విరుచుకుపడింది. పెషావర్, ఛారసద్దా, నౌషరా, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో తుఫాను బీభత్సం సృష్టించింద. ఫక్తునఖ్వాలో ప్రావిన్స్‌లోని ఖైబర్‌లో ఆదివారం సంభవించిన భారీ వర్షాలు , తుఫాను కారణంగా 35మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్, ఛారసద్దా, నౌషరా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అవడంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. పెషావర్ 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. 110కి.మీ వేగంతో భారీ ఎత్తున వీచిన గాలుల ధాటికి పలు ఇళ్లు నేలకూలాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల గోడలు కూలిపోయాయి. విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి.