ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వాటికి ఆనుకుని ఉన్న బస్తీలన్నీ నీటితో నిండిపోయాయి. దాదాపు రెండు వేల కిలోమీటర్ల పొడవైన రహదారులు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. శుక్రవారం కూడా కుండపోత వాన పడడంతో సహాయ చర్యలకూ ఆటంకం కలిగింది. తుర్కచెరువు ఉప్పొంగడంతో నిజాంపేట్‌లోని భండారి లేఅవుట్ ఇంకా చెరువును తలపిస్తోంది.