దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో సోమ(నేడు), మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా మారే అవకాశం ఉంది.
మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.
గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment