వీడియో: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం | Waterlogging With Heavy Rainfall In Delhi Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం

Published Thu, Aug 1 2024 7:58 AM | Last Updated on Thu, Aug 1 2024 9:18 AM

Waterlogging With Heavy Rainfall In Delhi Video Goes Viral

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకాధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.

ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విట్టర్‌ వేదికగా చెప్పుకొచ్చారు. ఇక, వర్షాలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రజలకు సూచించారు. కాగా, ఢిల్లీలో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ విధించింది. మరోవైపు.. వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement