
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం 11వ తేదీ వరకు వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో ఈనెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment