Southwest Bay of Bengal
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 7 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. -
తీవ్ర తుపానుగా మిచాంగ్
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొన సాగుతున్న మిచాంగ్ తుపాను సోమవారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా కొనసాగుతోంది. క్రమంగా బలపడుతూ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ.. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాని ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశా యని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. పలుచోట్ల భారీ వర్షాలు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు, గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తాయని తెలి పింది. ఇక బుధవారం రోజున పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వివరించింది. ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్ సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా రామగుండంలో 33.1 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రత.. అత్యల్పంగా మెదక్, ఆదిలాబాద్‌లలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంఉందని తెలిపింది. -
ఏపీకి మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం 11వ తేదీ వరకు వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈనెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. -
తీరం దాటినా.. తుపాన్‌గానే..
సాక్షి, విశాఖపట్నం: తీరం దాటుతుంది.. మళ్లీ సముద్రంలోకి ప్రవేశించి.. తుపాన్‌గా కొనసాగుతుంది.. ఆ తర్వాత మరోసారి తీరం దాటి బలహీనపడుతుంది. ఇదీ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న బురేవీ తుపాన్ స్వరూపం. తీవ్ర వాయుగుండం బలపడి బుధవారం ఉదయం 8.30 గంటలకు తుపాన్‌గా మారిన బురేవీ.. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలైకు తూర్పుదిశగా 170 కిమీ, తమిళనాడులోని పాంబన్కు తూర్పు ఆగ్నేయ దిశగా 390 కిమీ, కన్యాకుమారికి తూర్పు ఈశాన్య దిశగా 560 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ.. శ్రీలంకకు సమీపంలో ట్రింకోమలైకి దగ్గర్లో శుక్రవారం సాయంత్రం గానీ, రాత్రికి గానీ తీరం దాటే అవకాశం ఉంది. అనంతరం.. ఇది పశ్చిమ దిశగా పయనించి.. మరోసారి సముద్రంలోకి తుపాన్‌గా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నైరుతి దిశగా పయనిస్తూ తమిళనాడులోని పాంబన్– కన్యాకుమారి మధ్య 3వ తేదీ రాత్రి గానీ, 4వ తేదీ ఉదయం గానీ బురేవీ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందనీ, అత్యధికంగా మేఘాల్ని తోడుకుపోవడంతో... దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల బురేవీ ప్రభావం స్వల్పంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. 3, 4 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
వాయుగుండంపై అప్రమత్తం!
అరసవల్లి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో జిల్లా అధికారులను రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. బుధవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తుండటంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్.వై.దొర.. జిల్లా విద్యుత్ శాఖాధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎస్ఈ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వాయుగుండం, తీవ్ర గాలుల వల్ల విద్యుత్ పరంగా అధికంగా దెబ్బతినే ప్రాంతాలు, ముంస్తుచర్యలపై ఆరా తీశారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస, కవిటి మండలాల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని సీఎండీ తెలిపారు. ఆ ప్రాంతాలకు అదనంగా విద్యుత్ స్తంభాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తాయని సంకేతాలు వస్తున్నాయని ఈ తరుణంలో స్తంభాలు పడిపోయే ప్రమాదాలున్నాయని వివరించారు. విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడే అవకాశాలున్నాయని, ఎక్కడికక్కడ అదనంగా సిబ్బందిని నియమించి, పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం నుంచి విద్యుత్ సిబ్బందికి కచ్చితంగా సెలవులన్నీ రద్దుచేయాలని స్పష్టంచేశారు. సరిహద్దు తీరప్రాంతాలపై దృష్టి అనంతరం ఎస్ఈ దత్తి సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో వాయుగుండం ప్రభా వంపై సీఎండీ దొరతో పాటు విద్యుత్ శాఖ మంత్రి క్యాం పు కార్యాలయం, కలెక్టర్ ధనుంజయరెడ్డి తదితరులు సూచనలిచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 18 అర్ధరాత్రి నుంచి 19 అర్ధరాత్రి వరకు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. అందుకే టెక్కలి డివిజన్లో ఒడిశా సరిహద్దు ప్రాంతం, తీరప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. ఇందులో భాగంగా సోంపేట, పలాస సరిహద్దు ప్రాంతాలకు 200 విద్యుత్ స్తంభాలను పంపించామని వెల్లడించారు. తీవ్ర గాలులతో విద్యుత్ నష్టం జరిగిన వెంటనే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆదేశించామన్నారు. జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం డీఈలు, ఏఈలు, తదితర సిబ్బందితో చర్చించి, ప్రణాళికలు తెలియజేసినట్లు వివరించారు.సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు, గాలులు వచ్చే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం ప్రభావం 18వ తేదీ రాత్రి, 19న (బుధ, గురువారాల్లో) ఎక్కువగా ఉంటుందన్నారు. దక్షిణ ఒడిశా, శ్రీకాకుళం మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోందన్నారు. ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల మండలాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఒడిశాలో వర్షాల వల్ల వంశధార, నాగావళి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రెండు నదులు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల వద్ద ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వరదలు వచ్చినా తట్టుకునేలా ముందస్తు జాగ్రత్తగా ఆహార సామగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
అప్రమత్తం!
అరసవల్లి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారడంతోపాటు భారీ వర్షాలతోపాటు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి ఆపద వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. జిల్లా ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపిడిఇసిఎల్) ఎస్ఈ దత్తి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా జిల్లాలో ఈనెల 18, 19, 20 తేదీల్లో వాయుగుండం ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందన్న సంకేతాలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని వివరించారు. స్తంభాలు నేలకొరిగితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతానికి రెండు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసరమైతే మరో 14 వేల స్తంభాలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైతే విద్యుత్ ప్రైవేట్ కార్మికులను సుమారు 600 మంది సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. అలాగే పోల్ డ్రిల్లింగ్ మిషన్లు టెక్కలి డివిజన్లో రెండు, శ్రీకాకుళం డివిజన్లో ఒకటి సిద్ధంగా ఉన్నాయన్నారు. వాయుగుండం ప్రభావంతో తీవ్రవైన గాలులతో తీర ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయంతోపాటు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. -
ఇక చలి పంజా..!
-
ఇక చలి పంజా..!
సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్లుగా చలికి దూరంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక శీతాకాలాన్ని చవి చూడనున్నారు. వాస్తవానికి నవంబర్ మూడో వారం నుంచే చలి మొదలవుతుంది. కానీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో ఈ ఏడాది చలి కాస్త ఆలస్యమైంది. అల్పపీడనాలు, ద్రోణుల వల్ల ఆకాశంలో మేఘాలేర్పడతాయి. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టక చలి తీవ్రత కనిపించదు. కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనద్రోణి కూడా బలహీనపడుతోంది. మరోవైపు అధిక పీడనం ప్రభావంతో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాల వైపు చల్లటి వాయవ్య గాలులు వీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. ‘ఆకాశంలో మేఘాల్లేకపోతే పగటి పూట భూమి త్వరగా వేడెక్కుతుంది. మబ్బులుంటే వేడి పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది. ప్రస్తుతం ఆకాశంలో మేఘాలు లేక సత్వరమే భూమి వేడెక్కి, రాత్రి అయ్యే సరికి వేగంగా చల్లబడిపోతుంది. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ చలి తీవ్రత పెరగడానికి కారణమవుతోంది’ అని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, ఉత్తరకోస్తాలపై చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని ఆయన వివరించారు. గురువారం అత్యల్పంగా ఏపీలోని లంబసింగిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే రెండు డిగ్రీలు పడిపోయింది. మరోవైపు గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. -
వాయుగండం..
♦ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండో రోజూ భారీ వర్షాలు ♦ తిరుమలలో 30 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ♦ చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు గల్లంతు ♦ చలి తీవ్రతకు ముగ్గురి బలి .. తమిళనాడులో 22 మంది మృతి సాక్షి నెట్వర్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం మొదలైన వర్షాలు మంగళవారం ఉధృతరూపం దాల్చా యి. తిరుమలలో రికార్డుస్థాయిలో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వాగులు, వంక లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వర్షాల ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరి, వేరుశనగ, టమాట, అరటి, బొప్పాయి వంటి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అపారమైన నష్టం సంభవించింది. జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. చలి తీవ్రతకు తట్టుకోలేక నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అన్నంగారి పల్లె చిన్నతోపునకు చెందిన మంచూరి వెంకటస్వామి(55), ఆయన కుమార్తె రజిత(15) గార్గేయ వాగులో కొట్టుకుపోయారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో గుండ్లకండ్రిగ దగ్గర కార్తీక్ అనే చిన్నారి నీటిలో కొట్టుకుపోయాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండ లం దగ్గవోలు సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ పోలంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి(33) కందలవారిపల్లి వాగులో కొట్టుకుపోయాడు. కలువాయి మండలం లలితానగర్ వద్ద వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు తమిళనాడులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 500 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తిరుమల రెండో ఘాట్ ధ్వంసం వర్షాలకు తిరుమల రెండో ఘాట్‌రోడ్డు ధ్వంసమైంది. 7 నుంచి 16వ కిలోమీటర్ మార్గం లో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి వందకుపైగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై అడ్డంగా భారీగా రాళ్లు పడ్డాయి. పది మీటర్ల ఎత్తులో రాళ్లు కూలిపోవడంతో పైభాగంలో ఉండే రోడ్డు కూడా కూలే పరిస్థితి నెలకొంది. రెండో ఘాట్‌లో 13వ కిలోమీటర్ నుంచి లింకురోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లేదారిని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల వరకు లేదా అరగంట ఇటూఅటుగా మూసివేసే అధికారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులకు కల్పించారు. -
దూసుకొస్తున్న ‘రోవాను’
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఏర్పడిన తొలి తుపాను ’రోవాను’ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడుతోంది. ఆదివారం రాత్రికి ఈ వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 320 కి.మీ.లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 300 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కి.మీ.ల వేగంతో కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారనుంది. తుపాను సోమవారం అర్ధరాత్రికి కరైకల్, చెన్నైల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుపాను తమిళనాడు వైపు పయనిస్తున్నప్పటికీ దాని ప్రభావం తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలపై కూడా ఉండనుంది. మాల్దీవులు సూచించిన పేరు తాజా తుపానుకు ‘రోవాను’ పేరును మాల్దీవులు దేశం సూచించింది. తుపాను ఏర్పడ్డాక పేరును ప్రకటించడం ఆనవాయితీ. అందువల్ల రోవానుగా సోమవారం ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం తమిళనాడుపై ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అక్కడక్కడ వర్షాలుగానీ, ఉరుములతో కూడిన జల్లులుగానీ కురవవచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఆకాశం కూడా మేఘావృతమై ఉంటోంది. -
చివరి ఆశలపై నీళ్లు
శ్రీకాకుళం అగ్రికల్చర్: అకాల వర్షాలతో అన్నదాత బెంబేలెత్తుతున్నాడు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలలపడటంతో. దాని ప్రభావంతో సోమవారం సోమవారం సాయంత్రం జిల్లాలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఇచ్చిందే స్వల్పం.. అందులోనూ స్వార్థంకళ్లాల్లో ఉన్న ఖరీఫ్ ధాన్యం దిగుబడులు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హుద్‌హుద్ తుపాను, సుడిదోమ తాకిడితో పంట దిగుబడి, నాణ్యత బాగా తగ్గిపోయాయి. చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముదామంటే తగిన ధర రాక చాలా మంది రైతులు ధాన్యాన్ని కళ్లాల్లోనే ఉంచి ధర కోసం ఆశగా చూస్తున్నారు. ఈ తరుణంలో కురిసిన అకాల వర్షాలతో ఆ ధాన్యం కూడా తడిసి ఈ మాత్రం ధర కూడా దక్కదేమోనని ఆవేదన చెందుతున్నారు. అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఆకాశం మబ్బు పట్టి చలిగాలుల తీవ్రత పెరిగింది. ఈ మార్పులను గమనించిన రైతులు ధాన్యాన్ని రక్షించుకునేందుకు టర్పాలిన్లు వగైరాలతో కప్పిపెట్టారు. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉంది. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు కురిసి ఆగిపోయాయి. అయితే సాయంత్రం చీకటి పడే సమయానికి శ్రీకాకుళం పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా పెద్ద వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ధాన్యం తడిసి మొలక వచ్చేస్తుందని రైతులు చెబుతున్నారు. సాంబ వంటి రకాలకైతే మరింత వేగంగా మొలకలు వస్తాయంటున్నారు. ఈ ఏడాది వరి సాగు పెట్టుబడి ఎకరాకు 40 నుంచి 50 శాతం పెరిగింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చేసిన అప్పులు తీర్చలేక అల్లాడుతున్న రైతు పరిస్థితిని ప్రస్తుత అకాల వర్షాలు మరింత దిగజార్చే ప్రమాదముంది. పడిపోయిన ఉష్ణోగ్రతలు ఇదిలా ఉండగా జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి కనిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో గాలుల తీవ్రత కూడా పెరగడంతో చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు, రోగులు అవస్థలు పడుతున్నారు. ఆది, సోమవారాల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు తగ్గాయి. -
విశాఖ నగరాన్ని వణికిస్తున్న చలిపులి
విశాఖపట్నం: నగరంలో చలిపులి పంజా విసురుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలితీవత్ర రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్కసారిగా గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికీ విశాఖలో 20 నుంచి 23 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాంతో విశాఖ మన్యం ప్రాంతంలో చల్లగాలులు వీస్తున్నాయి. రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా ఈదురుగాలులు వీసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా దక్షిణాకోస్తాలో చాలా చోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముంది. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. -
వణుకుతున్న రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ పెరిగిపోతున్న చలి రాష్ట్రాన్ని వణికిస్తోంది. గత వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో.. చలికి ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. సాయంత్రం నాలుగు గంటలయ్యే సరికే చలిగాలులు వీస్తున్నాయి. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో తెల్లవారుజామున, సాయంత్రం తర్వాత ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇదే సమయంలో వివిధ ప్రాంతాల్లో నాలుగైదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు కావడం గమనార్హం. సాధారణంగా తుపాను పరిస్థితులున్నప్పుడు చలి తక్కువగా ఉంటుంది. కానీ, నైరుతి బంగాళాఖాతంలో ‘మాదీ’ తుపాను విజృంభించే అవకాశం కనిపిస్తున్నా.. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఓ వైపు మేఘాలు దట్టంగా ఏర్పడడం, మరోవైపు మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి ఉత్తరదిశగా శీతల గాలులు వీస్తుండడమే దీనికి కారణం. శనివారం విశాఖ ఏజెన్సీలో లంబసింగిలో 6 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అక్కడి వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సముద్ర మట్టానికి సుమారు 1,000 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే సాయంత్రం 4 దాటితే.. జనం ఇళ్లకే పరిమితమైపోతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ గత ఏడాది ఇదే తేదీన నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కంటే శనివారం ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. శ్రీవారి క్షేత్రమైన తిరుమలలోనూ చలి వణికిస్తోంది. కారణాలివీ.. డిసెంబర్ 15వ తేదీతో తుపాన్ల సీజన్ ముగుస్తుందని, ఫిబ్రవరి నెలాఖరువరకు చలి తప్పదని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరుగుతున్న కొద్దీ చలి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా చలి వేస్తుందని, పొగ మంచు దట్టంగా కురుస్తుందని అధికారులు తెలిపారు. కాగా.. ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలతో శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూమోనియా, ఆస్తమాలతో బాధపడుతున్నవారు, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్, తిరుపతి నగరాలకు చెందిన పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంవల్ల తూర్పు గాలులు బలంగా ఉంటున్నాయి. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం లేనప్పటికీ శుక్రవారం నాటి వాతావరణం ఆధారంగా అంచనాలు మారుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. ఉత్తర కోస్తాంధ్రలో దాదాపు పొడి వాతావరణమే నమోదు కావచ్చునని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఢిల్లీలోని వాతావరణశాఖ కూడా అల్పపీడనం బలపడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. -
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం రాత్రి నాటికి కూడా వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉంది. ఈనెల 16వ తేదీ రాత్రి నాటికి నాగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలి పారు. రాష్ర్టంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లోనూ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. దక్షిణ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. 16, 17తేదీల్లో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.