సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఏర్పడిన తొలి తుపాను ’రోవాను’ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడుతోంది. ఆదివారం రాత్రికి ఈ వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 320 కి.మీ.లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 300 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కి.మీ.ల వేగంతో కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారనుంది. తుపాను సోమవారం అర్ధరాత్రికి కరైకల్, చెన్నైల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుపాను తమిళనాడు వైపు పయనిస్తున్నప్పటికీ దాని ప్రభావం తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలపై కూడా ఉండనుంది.
మాల్దీవులు సూచించిన పేరు
తాజా తుపానుకు ‘రోవాను’ పేరును మాల్దీవులు దేశం సూచించింది. తుపాను ఏర్పడ్డాక పేరును ప్రకటించడం ఆనవాయితీ. అందువల్ల రోవానుగా సోమవారం ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది.
దూసుకొస్తున్న ‘రోవాను’
Published Mon, Nov 9 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM
Advertisement