న్యూఢిల్లీ: పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత నావికా దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు అణు జలాంతర్గాములు సహా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో కూడిన భారీ ఆయుధ సంపత్తిని ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో మోహరించింది. పుల్వామా దాడి సమయంలో ట్రాపెక్స్–2019 పేరుతో నేవీ భారీ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో యుద్ధ వాహన నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గాములు ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ చక్రం, 60 యుద్ధ నౌకలు, 12 తీరరక్షక ఓడలు, 60 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ మొత్తం ఆయుధ సంపత్తిని రక్షణ శాఖ పాక్‌తో సరిహద్దు జలాల్లోకి తరలించి యుద్ధ సన్నద్ధతను ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఈ బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment