high alert on sea areas
-
నేవీలో హై అలర్ట్
కోయంబత్తూర్/కొచ్చి: భారతీయ నేవీలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు తమిళనాడులోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ‘ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమా చారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ను విధించింది’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలం క నుంచి సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి చొర బడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు. గుజరాత్ తీరంలో పాక్ పడవలు గుజరాత్‌లోని కచ్ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్‌కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. -
కశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు
మాస్కో/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని స్పష్టం చేసింది. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నాం. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం’ అని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. నేవీలో హై అలర్ట్ భారత నేవీలో శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి సముద్ర దాడులనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము అప్రమత్తంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ‘తీర ప్రాంత భద్రతా చర్యలు వేగవంతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి’అని నావికాదళ సిబ్బంది డిప్యూటీ చీఫ్ మురళీధర్ పవార్ వెల్లడించారు. ‘సముందరి జిహాద్’పేరుతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు సముద్రంలో దాడులు చేసేందుకు తమ కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అన్ని నేవీ స్టేషన్లలో హై అలర్ట్ విధించారు. లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులు నిలిపివేత లాహోర్–ఢిల్లీల మధ్య నడుస్తున్న బస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. జాతీయ భద్రతా సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పోస్టు సేవల మంత్రి మురద్ సయీద్ అన్నారు. కరాచీ నుంచి వచ్చే థార్ ఎక్స్‌ప్రెస్ 165 మంది ప్రయాణికులతో శనివారం భారత్ సరిహద్దుకు చేరుకుంది. అక్కడి నుంచి మరో లింకు రైలు ద్వారా ప్రయాణికులను భారత్ తీసుకొచ్చారు. దీనికి ముందు ఈ రైలును సరిహద్దు వరకు తీసుకురావడానికి పాక్ అనుమతించింది. -
వాయు ఎఫెక్ట్ : స్కూళ్లు, కాలేజీలకు సెలవు
గాంధీనగర్ : తుపాను ‘వాయు’ ఉత్తర భారతం వైపు చురుకుగా కదులుతోంది. జూన్ 13 నాటికి గుజరాత్‌లోని పోరబందర్ ముహువాల మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముందు జాగ్రత్తగా చర్యగా అధికారులు జూన్ 13న పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇక తీరాన్ని తాకిన రెండ్రోజుల తర్వాత గుజరాత్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంటే గురువారం నాటికి తీవ్రరూపం దాలుస్తుందని అధికారులు చెప్పారు. లక్ష్వద్వీప్‌లోని అమినిదీవిలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న 48 గంటల్లో ఇది బలపడుతుందని చెప్పారు. ఫలితంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు రోజుల పాటు పర్యాటకులు ఎవరూ గుజరాత్ రావద్దని.. ప్రస్తుతం ఉన్న వారు పర్యటనకు వెళ్లవద్దని కోరారు. వాయు తుపాను కారణంగా గుజరాత్లో భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీర ప్రాంతంలో మోహరించాయి. సౌరాష్ట్ర కచ్ తీరంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయి. ఇక తీరప్రాంతం వెంబడి ఆర్మీ, నేవీ బలగాలతో పాటు కోస్ట్ గార్డ్ కూడా అలర్ట్‌గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. -
అరేబియా జలాల్లో నేవీ హై అలర్ట్
న్యూఢిల్లీ: పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత నావికా దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు అణు జలాంతర్గాములు సహా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో కూడిన భారీ ఆయుధ సంపత్తిని ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో మోహరించింది. పుల్వామా దాడి సమయంలో ట్రాపెక్స్–2019 పేరుతో నేవీ భారీ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో యుద్ధ వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ చక్రం, 60 యుద్ధ నౌకలు, 12 తీరరక్షక ఓడలు, 60 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ మొత్తం ఆయుధ సంపత్తిని రక్షణ శాఖ పాక్‌తో సరిహద్దు జలాల్లోకి తరలించి యుద్ధ సన్నద్ధతను ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఈ బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు. -
తీరంలో అప్రమత్తం
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలోని సముద్ర తీరంలో హై అలెర్ట్ ప్రకటించారు. తీరప్రాంతాల్లో మైరెన్ పోలీసులు నిఘా పెట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర వేడుకల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారి చేశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం సముద్ర తీరంపై నిఘా పెడుతున్నట్టు మెరైన్ ఐజీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 192 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి మెరైన్ పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానితులు తారసపడితే వారిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. సముద్రమార్గం గుండా బోట్లలో ఎవరైనా జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్నది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇలా జిల్లాలోకి చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు చేరుకుని విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గస్తీని మరింత ముమ్మరం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలకు ఉగ్రవాదులు చోరబడే అవకాశాలున్న మార్గాలను వివరించి, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మెరైన్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లా పోలీసు యంత్రంగం కూడ అప్రమత్తమైంది. ప్రధాన మార్గాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు అనుకుని ఉన్న రోడ్డు మార్గాల పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ మేరకు సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.