నైరుతి అరేబియా మహాసముద్రంలో వాయుగుండం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడుతుంది.
దాంతో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం క్రమంగా మన రాష్ట్రం వైపునకు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలా అయితే రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.