విశాఖపట్నం: అరేబియా సముద్రంలో అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురస్తాయని పేర్కొంది.
తెలంగాణ, కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలోనూ బలమైన అల్పపీడనం ఏర్పడిందని... ఇది బంగ్లాదేశ్ తీరానికి చేరువలో కేంద్రీకృతమైందని తెలిపింది. అయితే ఇది బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.