బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి  | Viral: Missing MiG-29K Pilots Wedding Invite | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి 

Published Sun, Nov 29 2020 6:48 AM | Last Updated on Sun, Nov 29 2020 6:50 AM

Viral: Missing MiG-29K Pilots Wedding Invite - Sakshi

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మిగ్‌–29 కె శిక్షణా విమానం కూలిన ఘటనలో గల్లంతైన కమాండర్‌ నిశాంత్‌ సింగ్, గతంలో తన వివాహ అనుమతి కోరుతూ పై అధికారులకు హాస్యపూరితమైన లేఖను రాశారు. తన పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ‘బుల్లెట్‌ దెబ్బకు బలయ్యే అవకాశాన్నివ్వండి’అంటూ ఆయన రాసిన చమత్కారపూరితమైన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గురువారం మిగ్‌–29 కె శిక్షణా విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలెట్‌ని రక్షించగలిగారు, నిశాంత్‌ సింగ్‌ మాత్రం గల్లంతయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో తన వివాహానికి అనుమతినివ్వాలని కోరుతూ మే 9వ తేదీన తన వృత్తిలోని అంశాలకు సృజనాత్మకతను జోడిస్తూ అధికారులకు కమాండర్‌ నిశాంత్‌సింగ్‌ హాస్యపూర్వకంగా లేఖ రాశారు. దీనికి ‘మంచిపనులన్నీ శుభం కార్డుతో ముగుస్తాయి, నరకానికి స్వాగతం’’అని నిశాంత్‌ సింగ్‌ సీనియర్‌ అధికారి ప్రతి స్పందించారు.   (ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement