MiG-29K
-
గోవా తీరంలో కుప్పకూలిన మిగ్-29కే ఫైటర్ జెట్
పనాజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. యుద్ధవిమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే కూలిపోయినట్లు నౌకదళం వెల్లడించింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిక్-29కే యుద్ధ విమానం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది నేవీ. 2019 నుంచి మిగ్-29కే ప్రమాదానికి గురికావటం ఇది నాలుగోది. ఫైటర్ జెట్‌లో రష్యా తయారు చేసిన కే-36డీ-3.5 జెట్ నుంచి విడిపోయే సీటు ఉంది. ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా చెబుతారు. హ్యాండిల్ లాగగానే ముందుగా వెనుక సీట్లో ఉన్న పైలట్, ఆ తర్వాత ముందు సీటులోని పైలట్ జైట్ నుంటి బయటపడతారు. ఇదీ చదవండి: ‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు -
బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మిగ్–29 కె శిక్షణా విమానం కూలిన ఘటనలో గల్లంతైన కమాండర్ నిశాంత్ సింగ్, గతంలో తన వివాహ అనుమతి కోరుతూ పై అధికారులకు హాస్యపూరితమైన లేఖను రాశారు. తన పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ‘బుల్లెట్ దెబ్బకు బలయ్యే అవకాశాన్నివ్వండి’అంటూ ఆయన రాసిన చమత్కారపూరితమైన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం మిగ్–29 కె శిక్షణా విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలెట్‌ని రక్షించగలిగారు, నిశాంత్ సింగ్ మాత్రం గల్లంతయ్యారు. లాక్డౌన్ కాలంలో తన వివాహానికి అనుమతినివ్వాలని కోరుతూ మే 9వ తేదీన తన వృత్తిలోని అంశాలకు సృజనాత్మకతను జోడిస్తూ అధికారులకు కమాండర్ నిశాంత్‌సింగ్ హాస్యపూర్వకంగా లేఖ రాశారు. దీనికి ‘మంచిపనులన్నీ శుభం కార్డుతో ముగుస్తాయి, నరకానికి స్వాగతం’’అని నిశాంత్ సింగ్ సీనియర్ అధికారి ప్రతి స్పందించారు. (ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం) -
లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహించేందుకు భారతీయ నౌకాదళానికి చెందిన పొసీడాన్ 8ఐ జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాన్ని భారత్ రంగంలోకి దింపింది. చైనా దళాల కదలికను గమనించేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. అలాగే, మరికొన్ని ఎంఐజీ –29కే జెట్ విమానాలను కూడా త్వరలో నార్తర్న్ సెక్టార్‌లోని పలు కీలక వైమానిక కేంద్రాలకు తరలించనుంది. వీటి మోహరింపుతో వైమానిక దళ సామర్థ్యం, గగనతల ఆధిపత్యం మరింత మెరుగుపడుతుందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం నౌకాదళం వద్ద 40 ఎంఐజీ–29కే జెట్ విమానాలున్నాయి. ఇప్పటికే తూర్పు లద్దాఖ్, తదితర ప్రాంతాల్లోని కీలక ఎయిర్‌బేసెస్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. ఆగస్ట్ చివరినాటికి ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్‌ను కూడా లద్దాఖ్‌లో సిద్ధంగా ఉంచాలని భారత్ భావిస్తోంది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో భారత నౌకాదళం, అమెరికా నేవీతో కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో మిలటరీ డ్రిల్స్ నిర్వహించింది. ఈ డ్రిల్స్‌లో పాల్గొన్న అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిజ్ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. మరోవైపు, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) దేశీయంగా రూపొందించిన డ్రోన్‌ను త్వరలో తూర్పు లద్దాఖ్‌లోని ఆర్మీ బేస్‌లకు పంపించనున్నారు. ఈ డ్రోన్‌కు ‘భారత్’ అని డీఆర్డీఓ నామకరణం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో, కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇది గస్తీ విధులు నిర్వహించగలదని డీఆర్డీఓ పేర్కొంది. -
ఏ ముప్పునైనా ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తలెత్తగల సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉందని వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు. అత్యవసర సమయాల్లో మిత్రదేశాలకు సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడు ముందుంటుందని వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. ‘దేశానికి సరిహద్దుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌కు అపరిష్కృత సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల కారణంగా ప్రధాన ముప్పు ఎదురవుతోంది. సరిహద్దు అవతల నుంచి ఎదురయ్యే ఉగ్రముప్పును సైతం ఐఏఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. పొరుగున ఉన్న దేశాలు(చైనా, పాక్) ఆయుధ వ్యవస్థల్ని శరవేగంగా ఆధునీకరించడం, మౌలిక వసతులను మెరుగుపర్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు దీటుగా మిగ్–29, జాగ్వార్, మిరేజ్–2000లను ఆధునీకరిస్తున్నాం. అలాగే 83 తేజస్, 36 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేస్తున్నాం’ అని తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ చురుకైన పాత్ర పోషించడంపై స్పందిస్తూ..‘ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలపై భారత్ పూర్తి అప్రమత్తంగా ఉంది. అత్యధిక సీ–17 గ్లోబల్ మాస్టర్ యుద్ధ విమానాలు వినియోగిస్తున్న జాబితాలో ఐఏఎఫ్ రెండోస్థానంలో ఉంది. వాయుసేనకు 42 స్క్వాడ్రన్ల యుద్ధవిమానాలు కావాల్సి ఉండగా 32 స్క్వాడ్రన్లు ఉన్నాయన్నారు. -
రూ.10 వేల కోట్లు వృథా?
న్యూఢిల్లీ: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా ఉండాలనేది భారత నేవీ కల. ఆ కలను నిజం చేసుకోవడానికి సముద్ర జలాలపై పట్టుకు కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా మిగ్-29కే విమానాలను భారత్ కొనుగోలు చేసింది. విమానాలను తయారు చేసిన రష్యా వాటిని వాడకానికి ఉపయోగించక ముందే దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిగ్-29కే సామర్ధ్యంపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మిగ్-29కే విమానాల సామర్ధ్యం మీద అనుమానాలు వ్యక్తం చేసింది. వేల కోట్లు పోసి కొనుగోలు చేసిన విమానాల పనితీరు సరిగా ఉండటం లేదని, అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే వినియోగానికి అందుబాటు ఉంటున్నట్లు పేర్కొంది. పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలకు మిగ్-29కే మీద రివ్యూని ఇచ్చిన కాగ్.. విమానం వ్యవస్థ, పనితీరు, డిజైనింగ్ లలో లోపాలపై తీవ్రంగా స్పందించింది. అత్యవసర సమయాల్లో వినియోగానికి 50 శాతం కంటే తక్కువగా అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. 2004 నుంచి 2010 మధ్యలో దాదాపు రూ.10,500 కోట్లతో భారత్ రష్యా నుంచి 45 మిగ్-29కే విమానాలను కొనుగోలు చేసింది. వీటిని యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ద్వారా నేవీ వినియోగిస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న విక్రాంత్, డిజైనింగ్ దశలో ఉన్న విశాల్ లను మిగ్-29కేను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నారు. 2010లో మిగ్-29కే వినియోగాన్ని ప్రారంభించిన నేవీ దాదాపు 50 శాతానికి పైగా విమానాల ఇంజన్లలో డిజైన్ సంబంధిత లోపాలతో వినియోగానికి తరచూ దూరమయ్యాయి. లోపాలతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. విమాన ఇంజన్ లోపంతో సింగిల్ ఇంజన్ మీద పది సార్లు ల్యాండయిన ఘటనలు ఉన్నాయని కాగ్ రివ్యూ రిపోర్టులో తెలిపింది. నౌకకు ఉండే చిన్న కారిడార్ మీద ల్యాండవుతున్న సమయంలో మిగ్-29కే కాంపోనెంట్స్ పలుమార్లు ఫెయిల్ అయ్యాయి. నేవీ పలుమార్లు మిగ్-29కే డిజైన్ ను మార్చి సరికొత్త డిజైన్ ను అప్ డేట్ చేసిన ప్రయోజనం లేదని, భారతీయ నేవీ పైలట్లు ట్రైనింగ్ సమయంలో పలుమార్లు విపరిణామాలు ఎదుర్కొన్నట్లు వివరించింది. అధికారులు ఏమంటున్నారు.. మిగ్-29కే సమస్యలు ఇప్పటికిప్పుడు పరిష్కరించలేమని సీనియర్ నేవీ అధికారులు అంటున్నారు. మిగ్-29కే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బాగుంటుందని, యుద్ధ విమానాల వాహాకనౌక గోర్ష్ కోవ్ పునరుద్దరణ, మిగ్-29కేలను ప్యాకేజ్ డీల్ గా తీసుకున్నారని తెలిపారు. గోర్ష్ కోవ్ పునరుద్దరణ అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యగా దాని పేరును మార్చింది. ప్రస్తుతం గోవాలో ఉన్న విమానాల తయారీదారులకు చెందిన రష్యా ఇంజనీర్ల బృందం ఎయిర్ క్రాఫ్ట్ ల టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రష్యా నేవీ కంటే ముందుగానే భారతీయ నేవీ మిగ్-29కే ల వినియోగాన్ని ఆరంభించిందని, కొత్త ప్లాట్ ఫాంను వినియోగించేటప్పుడు చిన్నచిన్న సమస్యలు మామూలేనని వారు అన్నారు. భారత నేవీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రష్యా డిజైన్లను మారుస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఆ దేశ ప్రధానంగా వినియోగిస్తున్న సుఖోయ్ యుద్ధ విమానాల స్థానంలో మిగ్-29కే లను వినియోగించేందుకు రష్యా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.