అలర్ట్‌: ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు | India Deploys Aircraft Carrier INS Vikramaditya In Arabian Sea | Sakshi
Sakshi News home page

అలర్ట్‌: ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు

Published Sat, Jan 11 2020 11:11 AM | Last Updated on Sat, Jan 11 2020 3:17 PM

India Deploys Aircraft Carrier INS Vikramaditya In Arabian Sea - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. చైనా- పాకిస్తాన్‌లు సంయుక్తంగా సోమవారం నుంచి అరేబియా సముద్రంలో తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్‌ తన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను తీరప్రాంతంలో మోహరించింది. మిగ్‌ 29కె యుద్ధవిమానంతో కూడిన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహక నౌకను మోహరించే సమయంలో నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధి కారులు అందులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య అంతర్‌ కార్యాచరణ, వ్యూహాత్మక సహకారం లక్ష్యంగా 'సీ గార్డియన్స్‌' పేరుతో చైనా- పాక్‌లు ఈ విన్యాసాలను ప్రారంబించనున్నాయి. ఇందులో ఇరుదేశాల జలాంతర్గాములు, విధ్వంసక నౌకలు, యుద్ధనౌకలు భాగం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement