ins vikramaditya
-
యూనిఫామ్ ఆమె తొడుక్కుంటారు
2019 ఏప్రిల్‌లో భారత నావికాదళం వారి ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. అత్తగారింటి బాధ్యతలను తల్లి ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అంతటితో ఆగలేదు. భర్త స్ఫూర్తిని కొనసాగించడానికి అతి కష్టమైన ఎస్ఎస్బి (సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) పరీక్షను పాసయ్యి ఆర్మీలో శిక్షణకు ఎంపికయ్యారు. జనవరి 7 నుంచి చెన్నైలో ఆమె శిక్షణ మొదలవుతోంది. ఆమె పరిచయం. ఏప్రిల్ 26, 2019. కర్వర్ హార్బర్. కర్ణాటక. మరికొన్ని గంటల్లో సముద్రంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య తీరానికి చేరుకుంటుంది. నావికాదళ యుద్ధనౌక అది. కాని ఈలోపే దానిలో మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న నావికాదళ అధికారులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇద్దరు ఆఫీసర్లు ఆ పోరాటంలో చనిపోయారు. వారిలో ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్. అప్పటికి అతనికి పెళ్లయ్యి కేవలం నలభై రోజులు. అతని భార్య కరుణ సింగ్‌కు ఆ వార్త అందింది. అత్తగారింట్లో ఉండగా... కరుణ సింగ్ ఆగ్రాలోని దయాల్బాగ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఒక మేట్రిమొని కాలమ్ ద్వారా ధర్మేంద్ర సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ‘వివాహానికి సంబంధించి నేనూ అందరిలాగే ఎన్నో కలలు కన్నాను’ అన్నారు కరుణ. ధర్మేంద్ర సింగ్‌ది మధ్యప్రదేశ్‌లోని కర్తాల్. ‘ఆయన మరణవార్త నాకు చేరేసరికి నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. నేను నా పదవ తరగతిలోపే మా నాన్నను కోల్పోయాను. ఇప్పుడు పెళ్లయిన వెంటనే భర్తను కోల్పోయాను. దేవుడు నా జీవితం నుంచి ఏదైనా ఆశించే ఈ పరీక్షలు పెడుతున్నాడా అనిపించింది’ అన్నారు కరుణ. స్త్రీలే బలం ‘నా భర్త మరణవార్త విని నేను కొన్ని రోజులు దిగ్భ్రమలో ఉండిపోయాను. అయితే మా అత్తగారు టీనా కున్వర్, మా అమ్మ కృష్ణా సింగ్ నాకు ధైర్యం చెప్పారు. చెట్టంత కొడుకును కోల్పోయిన మా అత్తగారు, కూతురి అవస్థను చూస్తున్న మా అమ్మ... ఇద్దరూ ధైర్యం కూడగట్టుకుని నాకు ధైర్యం చెప్పారు. ఈ ఇంటికి గాని ఆ ఇంటికి గాని నేనే ఇప్పుడు ముఖ్య సభ్యురాలిని అని అర్థమైంది. ఇరు కుటుంబాల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండిపోయాను’ అన్నారు కరుణ సింగ్. ఆర్మీలో చేరిక ‘అసోసియేట్ ప్రొఫెసర్‌గా నాకు మంచి ఉద్యోగం ఉంది. కాని నా భర్త మరణం తర్వాత అతని స్ఫూర్తిని సజీవంగా ఉంచాలని నాకు అనిపించింది. దేశమంతా తిరుగుతూ దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. నేవీలో పని చేసే అధికారులు నన్ను నేవీలో చేరమన్నారు. కాని నేను ఆర్మీని ఎంచుకున్నాను. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షకు హాజరవుదామనుకున్నాను. అయితే సైనిక వితంతువులకు రిటర్న్ టెస్ట్ ఉండదు. నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఐదు రోజుల పాటు వివిధ దశల్లో ఇంటర్వ్యూ సాగుతుంది. నేను సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. కాని మొదటి రోజునే పంపించేశారు. తిరిగి అక్టోబర్‌లో హాజరయ్యి ఫిజికల్ టెస్ట్‌లలో పాసయ్యాను. ఆ తర్వాత మౌఖిక ఇంటర్వ్యూ సుదీర్ఘంగా సాగింది. నాకు మంచి ఉద్యోగం ఉన్నా ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నానో అడిగారు. నాకు దేశసేవ చేయాలనుందని చెప్పాను. ఎంపికయ్యాను. ఆఫీసర్‌గా చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి నుంచి నా ట్రైనింగ్ మొదలయ్యి 11 నెలలు సాగుతుంది’ అని చెప్పారు కరుణ. ఆమె దేశం కోసం పని చేసే గొప్ప సైనిక అధికారి కావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి. తీర ప్రాంత పరీక్ష సౌకర్యాలపై పరీక్షించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై శనివారం ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు డీఆర్డీవో ప్రతినిధి తెలిపారు. నావికాదళానికే సంబంధించిన తేజస్ లైట్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భారత యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలో ఇదో గొప్ప మెట్టు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. -
అలర్ట్: ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. చైనా- పాకిస్తాన్‌లు సంయుక్తంగా సోమవారం నుంచి అరేబియా సముద్రంలో తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్ తన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను తీరప్రాంతంలో మోహరించింది. మిగ్ 29కె యుద్ధవిమానంతో కూడిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహక నౌకను మోహరించే సమయంలో నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధి కారులు అందులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య అంతర్ కార్యాచరణ, వ్యూహాత్మక సహకారం లక్ష్యంగా 'సీ గార్డియన్స్' పేరుతో చైనా- పాక్‌లు ఈ విన్యాసాలను ప్రారంబించనున్నాయి. ఇందులో ఇరుదేశాల జలాంతర్గాములు, విధ్వంసక నౌకలు, యుద్ధనౌకలు భాగం కానున్నాయి. -
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: భారత నావికా దళానికి చెందిన యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ నౌకాదళ అధికారి ప్రాణాలుకోల్పోయారు. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కర్వార్ యార్డ్‌కు వచ్చేటపుడు నౌకలో మంటలు చెలరేగాయి. లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో సిబ్బంది వేగంగా స్పందించి మంటలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించారు. ఈ క్రమంలో గాయాలపాలైన చౌహాన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఘటనపై నేవీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రమాదం
బెంగుళూరు : భారత దేశ ఏకైక యుద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ నేవీ అధికారి మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని కార్వార్ ఓడరేవుకు శుక్రవారం ఉదయం ఐఎన్ఎస్ విక్రమాదిత్య చేరుకునే సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, మంటలను అదుపుచేసే క్రమంలో లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కార్వార్‌లోని నేవీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మంటలు చెలరేగకుండా..వాహక నౌక ఫైర్ సిబ్బంది అదుపుచేసినప్పటికీ దట్టమైన పోగ వల్ల ఊపిరాడకపోవడంతో చౌహన్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. కాగా, వెంటనే సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో భారీ నష్టం తప్పింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య జనవరి 2014లో భారత నౌకాదళంలో చేరింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 60 మీ పోడవు, 284 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల ఎత్తుతో 44,500 టన్నుల బరువు కలిగి ఉంటుంది. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు సొంతం. -
యుద్ధ నౌకలో ఏటీఎం
న్యూఢిల్లీ: భారత అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం తొలిసారిగా ఏటీఎం సేవలు ప్రారంభించారు. ఎస్బీఐ నిర్వహించే ఈ ఏటీఎం సేవలను నౌకలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 15 వందల మందికి పైగా సిబ్బంది, అధికారులు వినియోగించుకుంటారు. నగదు ఉపసంహరణ, బదిలీ, క్రెడిట్ కార్డు చెల్లింపులు తదితర సేవలు ఈ ఏటీఎంలో అందుబాటులో ఉన్నాయని సమీప భవిష్యత్తులో దీన్ని నగదు డిపాజిట్ మెషీన్‌గా కూడా తీర్చిదిద్దుతామని ఓ అధికారి తెలిపారు. అలాగే నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహించే దిశగా రాబోయే రోజుల్లో ఈ యుద్ధ నౌకలో పీఓఎస్‌ను కూడా నెలకొల్పుతామని చెప్పారు. -
నీళ్లలో తేలే నగరం కోసం ప్రత్యేకంగా ఏటీఎం
భారత నౌకాదళంలో అతిపెద్ద విమానవాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను 'తేలే నగరం' అంటారు. ఈ నౌకలో శనివారం నాడు ఒక ఏటీఎం రానుంది. ప్రస్తుతం కర్ణాటకలోని కర్వర్ ప్రాంతంలో ఉన్న ఈ నౌకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎంను ఏర్పాటు చేయబోతోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐని నౌకాదళం కోరిన మీదట ఇది సాధ్యమైంది. శాటిలైట్ కమ్యూనికేషన్ లింకు ద్వారా ఈ మిషన్ డబ్బులను ఇస్తుంటుంది. రష్యాలో తయారైన ఈ నౌకను 2013 నవంబర్ నెలలో భారత నౌకాదళంలోకి తీసుకున్నారు. అందులో మొత్తం 1600 మంది అధికారులు, ఇతర సిబ్బంది పనిచేస్తుంటారు. వీళ్లకోసం ప్రతియేటా లక్ష కోడిగుడ్లు, 20వేల లీటర్ల పాలు, దాదాపు 16 టన్నుల బియ్యం, ఇంకా ఇతర నిత్యావసర సరుకులు ఖర్చవుతాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి.. నిరంతరం ఇది జలాల్లో ఉంటుంది. 45 రోజుల పాటు ఏకధాటిగా సముద్రంలోనే ఉన్నా కూడా అందులో ఉన్నవారందరికీ సరిపడ సరుకులు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఏటీఎంలో డబ్బులు అయిపోకుండా ఉండేందుకు నౌకలోనే ఒక కరెన్సీ చెస్టును కూడా పెడుతున్నారు. దాంతో సెయిలర్లు, అధికారులకు డబ్బు కొరత సమస్య ఇక ఉండబోదన్న మాట. -
ఐఎన్ఎస్ విక్రమాదిత్య జల ప్రవేశం
-
నడి సముద్రంలో నరేంద్ర మోదీ
-
నడి సముద్రంలో నరేంద్ర మోదీ
- అరేబియా సముద్ర జలాల్లోని విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన ప్రధానమంత్రి - అక్కడే త్రివిధ దళాధిపతులతో భేటీ కొచి: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా అరేబియా సముద్ర జలాల్లో వినూత్న రీతిలో కీలక సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొచి తీరానికి 40 నాటికన్ మైళ్ల దూరంలో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో.. ప్రధాన మంత్రి అధ్యక్షతన త్రివిధ దళాధిపతుల సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఈ సమావేశం కొనసాగుతుంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. కొచి తీరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విక్రమాదిత్య వద్దకు చేరుకున్న ప్రధానికి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. భారత నౌకాదళం అమ్ములపొదిలోని అతి భారీ యుద్ధనౌక అయిన విక్రమాదిత్యను మోదీ సందర్శించడం ఇది రెండోసారి. గత జూన్ లో ప్రధాని మోదీయే విక్రమాదిత్యను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత మోదీ కొల్లాం బయలుదేరతారు. అక్కడ కేరళ మాజీ ఆర్ శంకరన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఢిల్లీకి తిరుగుపయనమయ్యేలోగా కేరళ కేబినెట్ తోనూ భేటీ అవుతారని సమాచారం. -
ఐఎన్ఎస్ విక్రమాదిత్య జాతికి అంకితం
రాష్ట్రీయం తెలంగాణ రాష్ట్ర పండుగలుగా బోనాలు, బతుకమ్మ బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16న ప్రకటించింది. ఇక నుంచి ఈ రెండు పండుగలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. ఏపీలో త గ్గిన అటవీ విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 281 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిందని జూన్ 10న విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 46,389 చ.కి.మీ. అడవుల్లో 281 చ.కి.మీ. అడవులు క్షీణించినట్లు నివేదిక తెలిపింది. దేశంలో మైనింగ్ కోసం ఎక్కువగా అడవులను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అత్యధిక అటవీ భూమి ఉంది. తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. జాతీయం విక్రమాదిత్య జాతికి అంకితం దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌక పొడవు 282 మీటర్లు, బరువు 44,500 టన్నులు. ఇది 20 అంతస్తుల ఎత్తు మూడు ఫుట్‌బాల్ కోర్టులంత సైజు అంత ఉంటుంది. 45 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే గడిపే సామర్థ్యం దీని సొంతం. గతేడాది దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు దేశంలో 1.75 లక్షల మంది లక్షాధికారులు మనదేశంలో 2013 నాటికి 1.75 లక్షల మంది లక్షాధికారుల కుటుంబాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన 14వ వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న జాబితాలో మనదేశం 15వ స్థానంలో నిలిచింది. ‘రైడింగ్ ఏ వేవ్ ఆఫ్ గ్రోత్: గ్లోబల్ వెల్త్ 2014’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ పలు విషయాలు వెల్లడించింది. 2013లో ప్రపంచ ప్రైవేటు ఆర్థిక సంపద 14.6 శాతం మేర పెరిగి 152 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు వివరించింది. లక్షాధికారుల కుటుంబాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో 2012లో 16వ స్థానంలో ఉన్న భారత్.. 2013కి వచ్చేసరికి ఒక స్థానం మెరుగుపరుచుకుందని పేర్కొంది. 2018 నాటికి భారతదేశం ఏడో సంపన్న దేశంగా నిలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2012లో 1.37 కోట్ల మిలియనీర్ కుటుంబాలు ఉండగా, ఆ సంఖ్య 2013లో 1.63 కోట్లకు చేరుకుంది. అమెరికాలో అత్యధికంగా 71 లక్షల మిలియనీర్ కుటుంబాలున్నాయి. చైనాలో 2012లో 15 లక్షల లక్షాధికారి కుటుంబాలు ఉండగా, 2013లో ఆ సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. భారత ఆర్థిక వ్యవ స్థపై ప్రపంచ బ్యాంకు అంచనా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. గతేడాది 4.7 శాతం వృద్ధి సాధించింది. వచ్చే ఏడాది 6.3 శాతం, 2016లో 6.6 శాతం వృద్ధి రేటును భారత్ సాధించే అవకాశం ఉంది’ అని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థికాభివృద్ధి విషయంలో వర్ధమాన దేశాలకు నిరాశ ఎదురవుతుందని ఆ దేశాలు ఈ సంవత్సరం 5.3 శాతం పురోగతి సాధిస్తాయని గత జనవరిలో వేసిన అంచనాను బ్యాంక్ ప్రస్తుతం 4.8 శాతానికి కుదించింది. ఈ దేశాలు వచ్చే ఏడాది 5.4 శాతం, 2016లో 5.5 శాతం వృద్ధి సాధించవచ్చని తెలిపింది. చైనా ప్రభుత్వ యత్నాలు సఫలమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.6 శాతం విస్తరిస్తుందని అంచనా వేసింది. ఆసియా దేశాల్లో వృద్ధి రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది గడిచేకొద్దీ ప్రపంచ ఆర్థిక పురోగతి జోరందుకుంటుంది. గ్లోబల్ ఎకానమీ ఈ ఏడాది 2.8 శాతం, వచ్చే ఏడాది 3.4 శాతం, 2016లో 3.5 శాతం వృద్ధిచెందుతుంది. నర్మదా డ్యామ్ ఎత్తు పెంపునకు అనుమతి గుజరాత్లో వివాదాస్పద నర్మదా డ్యామ్ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.72 మీటర్లకు(455 అడుగులకు) పెంచుకునేందుకు నర్మదా నియంత్రణ అథారిటీ(ఎన్సీఏ) జూన్ 12న అనుమతి మంజూరు చేసింది. 1961 ఏప్రిల్ 5న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ డ్యామ్.. ముంపు ప్రాంతాలు, పునరావాస సమస్యలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తవుతోంది. ఎనిమిదేళ్ల కిందట డ్యామ్ ఎత్తును 121.92 మీటర్లకు పెంచుకునేందుకు ఎన్సీఏ అనుమతి ఇవ్వగా.. అది సరిపోదని, మరింత పెంచాలని గుజరాత్ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు పంపిణీ చేస్తారు. దీని ద్వారా గుజరాత్లో 17.92 లక్షల హెక్టార్లకు, రాజస్థాన్‌లో 2.46 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశముంటుంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ డ్యామ్(పరిమాణంలో). మొదటిది అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్టు. అలాగే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్పిల్ వే డిశ్చార్జి సామర్థ్యాన్ని కలిగి ఉంది. విద్యుత్ ఉత్పత్తిలో ఆర్ఏపీఎస్-5 రికార్డు విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం (ఆర్ఏపీఎస్)-5వ రియాక్టర్ అంతరాయం లేకుండా 678 రోజులపాటు పని చేసి ఆసియా స్థాయిలో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జూన్ 11 నాటికి ప్రతి రోజు 220 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో పనిచేసింది. ఇటువంటి సామర్థ్యాన్ని ఆసియాలోనే తొలిసారి ఒక అణు రియాక్టర్ ప్రదర్శించింది. ఆర్ఏపీఎస్-5 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. 2009, డిసెంబర్ 22న దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 2010, ఫిబ్రవరి 4 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. గతంలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలోని 160 మెగావాట్ల రెండో యూనిట్ 2009, జూలై నుంచి 2011, మార్చి వరకు 590 రోజులపాటు నిరంతరాయంగా పని చేసింది. అంతర్జాతీయం ప్రధాని తొలి విదేశీ పర్యటన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 15, 16 తేదీల్లో భూటాన్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి ఇరు దేశాల సంబంధాలను ‘బీ4బీ’(భూటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్)గా ఆయన అభివర్ణించారు. ఈ పర్యటనలో మోడీ ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో శాంతి భద్రతలు, పర్యాటకం తదితర అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధికి చేయూతలో భాగంగా భారత్ రూ.70కోట్ల వ్యయంతో నిర్మించిన భూటాన్ సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ భూటాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఇరుదేశాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యంగల ఖోలాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. డబ్ల్యూఏలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇంజనీరింగ్ స్టడీస్, ఇంజనీర్ల మొబిలిటీకి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం వాషింగ్టన్ అగ్రిమెంట్(డబ్ల్యూ ఏ) లో జూన్ 13న భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించింది. దీంతో భారతీయ డిగ్రీలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించడంతోపాటూ అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగాలకు భారతీయ ఇంజనీర్లు సులువుగా వెళ్లేందుకు అవకాశాలు విస్తృతమవుతాయి. 1989లో కుదిరిన ఈ ఒప్పందంపై 17 దేశాలు సంతకాలు చేశాయి. ఇంజనీరింగ్ డిగ్రీ కార్యక్రమాలకు అధికారిక గుర్తింపునిచ్చే సంస్థల మధ్య కుదిరిన ఈ అంతర్జాతీయ ఒడంబడికను వాషింగ్టన్ అకార్డ్గా పేర్కొంటారు. ఇందులో తాత్కాలిక సభ్యత్వం కలిగి ఉన్న భారత్ గత ఏడేళ్లుగా శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా రూవెన్ ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా రూవెన్ రివ్లిన్ను ఆ దేశ పార్లమెం ట్ జూన్ 10న ఎన్నుకుంది. షిమోన్ పెరెస్ స్థానంలో రూవె న్ జూలై 24న బాధ్యతలు స్వీకరిస్తారు. రూవెన్ గతంలో స్పీకర్‌గా,కమ్యూనికేషన్ల మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా కుతెస ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 11న తన 69వ సమావేశానికి ఉగండాకు చెందిన సామ్ కంబా కుతెసను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కుతెస ఉగండా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వార్తల్లో వ్యక్తులు నూతన ఏజీ ముకుల్ రోహత్గీ నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జూన్ 12న నియమితులయ్యూరు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జి.ఇ.వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత శాస్త్రవేత్తకు అత్యున్నత పురస్కారం బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన భౌతిక శాస్త్రవేత్త తేజిందర్ విర్దీకి బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 అత్యున్నతమైన ‘నైట్‌హుడ్’ పురస్కారాన్ని ప్రకటించారు. లార్జ్ హాడ్రన్ కొలైడర్ (దైవకణం) పరిశోధనలో చూపిన ప్రతిభకు ఈ పురస్కారం దక్కింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తేజిందర్ శాస్త్రరంగానికి విశేష సేవలు అందించారు. ఒబామా కొలువులో మరో భారతీయ శాస్త్రవేత్త అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో మరో భారతీయుడికి గౌరవం దక్కింది. భారత-అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌లో కీలక స్థానానికి ఎంపికయ్యారు. ఆయన్ను ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమించారు. సేతురామన్ మద్రాస్ యూనివర్సిటీ వివేకానంద కాలేజీ నుంచి 1981లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. ఐఐటీలో ఎంటెక్ చేసి చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో డేటా కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా రాజీవ్ ఠాక్రు స్థానంలో 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాస్(57)ను ప్రభుత్వం నియమించింది. దాస్ ప్రస్తుతం ఎరువుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. క్రీడలు పురుషుల ప్రపంచ హకీ కప్ విజేత ఆస్ట్రేలియా పురుషుల ప్రపంచ హకీ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. జూన్ 15న ద హేగ్‌లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. అర్జెంటీనా మూడో స్థానం దక్కించుకుంది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాను ఓడించి నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. ప్రపంచకప్ షూటింగ్లో జీతూకు రజతం భారత పిస్టల్ షూటర్ జీతూ రాయ్.. ప్రపంచకప్ షూటింగ్లో రజత పతకం సాధించాడు. జూన్ 11న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో జీతూ రెండో స్థానంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెరా స్వర్ణం దక్కించుకున్నాడు. ప్రారంభమైన సాకర్ వరల్డ్‌కప్ 20వ ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో జూన్ 12న ప్రారంభమైంది. జూలై 13 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 32 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బ్రెజిల్-క్రొయేషియాతో తలపడింది. ఈ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 3417 కోట్లు. విజేత జట్టుకు దక్కే మొత్తం రూ.207 కోట్లు. రన్నరప్ జట్టుకు లభించే మొత్తం రూ. 148 కోట్లు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను పురస్కరించుకుని భారత్‌లో రూ.5, రూ.25ల ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు. న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతుల మీదుగా జూన్ 12న వీటిని ఆవిష్కరించారు. ఇప్పటివరకు 19 ప్రపంచకప్ టోర్నమెంట్లు జరిగాయి. 1930లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో 13 జట్లు పాల్గొన్నాయి. అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టు బ్రెజిల్ (5). గత ప్రపంచకప్ 2010లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఫోర్బ్స్ జాబితాలో ధోని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదనతో తొలి 100 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులతో ఫోర్బ్స్ వెబ్సైట్ జాబితా రూపొందించింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి స్థానం దక్కింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ దాకా 12 నెలల కాలంలో ధోని రూ. 177 కోట్లు ఆర్జించి దేశంలోకెల్లా అత్యధిక ఆర్జన గల క్రీడాకారుడిగా ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఏకైక క్రీడాకారుడు ధోనియే. ఈ జాబితాలో అమెరికా బాక్సర్ మేవెదర్ అగ్రస్థానం (రూ. 621 కోట్లతో)లో నిలిచాడు. టైగర్ వుడ్స్ (రూ. 591 కోట్లతో) రెండో స్థానం పొందాడు. ఆసియా బిలియర్డ్స్ చాంప్ కొఠారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత జాతీయ చాంపియన్ సౌరవ్ కొఠారి విజేతగా నిలిచాడు. చండీగఢ్‌లో జూన్ 13న జరిగిన ఫైనల్లో కొఠారి అలోక్ (భారత్)ను ఓడించాడు. హాకీ మ్యాచ్ సమయం 60 నిమిషాలు ఇప్పటిదాకా 70 నిమిషాలున్న హాకీ మ్యాచ్ నిడివి 60 నిమిషాలకు కుదించా లని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నిర్ణయించింది. ప్రతి 15 నిమిషాలకు విరామం చొప్పున నాలుగు భాగాలుగా 60 నిమిషాల పాటు మ్యాచ్ సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడల నుంచి ఈ సమయాన్ని అమలు చేస్తున్నట్లు ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రె నెగ్రె జూన్ 15న ప్రకటించారు. -
విక్రమాదిత్య జాతిపరం
ఐఎన్ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ ఐఎన్ ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక నుంచి: దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ నౌక నేవీలో చేరడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ‘‘నేడు దేశానికి చాలా ముఖ్యమైన రోజు. భారత నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఐఎన్ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితం చేయడాన్ని నేను గర్వంగా భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం గోవా తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను మోడీ పరిశీలించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలుత సీ కింగ్ చాపర్‌పై యుద్ధనౌక పైకి చేరుకున్న ప్రధాని.. నేవీ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. 44,500 టన్నుల ఈ భారీ యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన అనంతరం కొద్ది గంటలపాటు నౌకపైనే కలియదిరిగారు. యుద్ధనౌక సామర్థ్యం, విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం మిగ్-29 యుద్ధ విమానంలో కూర్చున్నారు. ఆ తర్వాత నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. రక్షణ పరికరాల తయారీలో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడకుండా దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కోసం ‘వార్ మెమోరియల్’ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రక్షణ సిబ్బందికి ‘ఒక ర్యాంకు.. ఒకే పెన్షన్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై వివిధ రకాల యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలను ప్రధాని మోడీ తిలకించారు. కాగా, రక్తదానంలో యువత చురుగ్గా పాల్గొనాలని ప్రధాని శనివారం రక్తదాన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
యుద్ధనౌకలో మోడీ ప్రయాణం
-
యుద్ధనౌకలో మోడీ ప్రయాణం
ప్రధాని నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో ప్రయాణించారు. ఆ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ముందుగా గోవా చేరుకున్న మోడీ.. భారత నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించి యుద్ధ నౌక మొత్తాన్ని పరిశీలించారు. తన బ్రాండెడ్ పొట్టి చేతుల రంగు కుర్తా కాకుండా.. తెల్లటి పొడవు చేతుల కుర్తా, పైజమా ధరించి, దానిమీద నీలిరంగు నెహ్రూ కోటు ధరించిన మోడీ యుద్ధనౌకలో ఉన్న మిగ్-29కె యుద్ధవిమానంలో కూడా కాసేపు కూర్చుని దాని మీద నుంచి అభివాదం చేశారు. గోవా తీరం నుంచి సముద్రంలోకి ప్రవేశించిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. ఇది భారత నౌకాదళంలోనే అత్యంత భారీ నౌక. దీని పొడవు 283.5 మీటర్లు, వెడల్పు 59.8 మీటర్లు. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు ఉంది. 44,500 టన్నుల బరువున్న విక్రమాదిత్యను రష్యా నుంచి కొనుగోలు చేశారు. గత ఏడాది నవంబర్ 16వ తేదీన ఇది భారత నౌకాదళంలో చేరింది. మోడీతో పాటు నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్కే ధవన్ కూడా ఉన్నారు. వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు చెందిన మొత్తం బలం, బలగాన్ని మోడీ పరిశీలించారు. మిగ్ 29కె, సీ హారియర్లు, పి8 లాంగ్ రేంజి మారిటైమ్ పెట్రోల్ వాహనాలు, యాంటీ సబ్‌మెరైన్ విమానాలు, డార్నియర్లు, సీ కింగ్ హెలికాప్టర్లు.. అన్నింటినీ మోడీ పరిశీలించారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ స్వదేశంలో చేసిన తొలి పర్యటన ఇదే. -
యుద్ధనౌకలో మోడీ ప్రయాణం నేడు
ఐఎన్ఎస్ విక్రమాదిత్యను సందర్శించనున్న ప్రధాని పనాజీ: గోవా తీరంలో ఉన్న దేశ అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రయాణించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే తొలిసారి. అరేబియా సముద్ర జలాల్లో నిలిచిన ఈ యుద్ధనౌకపైకి ప్రధాని నేవీ హెలికాప్టర్లో వెళతారు. యుద్ధనౌక, నేవీ యుద్ధ విమానాలు సంయుక్తంగా చేపట్టే విన్యాసాలను మోడీ తిలకిస్తారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గత మే 26న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ ఢిల్లీ దాటి వెళ్లడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. రష్యా నుంచి 15 వేల కోట్లతో కొనుగోలు చేసిన 44,500 టన్నుల బరువైన విక్రమాదిత్య నౌకలో ఆయన 3 గంటలపాటు గడుపుతారు. గిన్నిస్ రికార్డుగా మోడీ ప్రచార సభలు: ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి ఎన్నికల ప్రచారం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేలా కన్పిస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఏకంగా 1,800 ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొనడం తెలిసిందే. దీన్ని గిన్నిస్ రికార్డుగా గుర్తించాలంటూ పార్థసారథి శర్మ అనే హోమియోపతీ వైద్యుడు లండన్‌లోని గిన్నిస్ నిర్వాహకులను సంప్రదించారు. పూర్తి వివరాలు పంపాల్సిందిగా వారు కోరినట్టు శుక్రవారం ఆయన తెలిపారు. ఈ విషయమై ఏప్రిల్‌లోనే బీజేపీ వర్గాలను కలిశానని, మోడీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీలు 5,000 పైచిలుకని వారు చెప్పారని అన్నారు. -
బరువైన బహుమానం
పాత పద్ధతిలో ఆలోచించడం మన వ్యవస్థని వ్యసనంలా పట్టుకుందా? ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకాదళంలో భాగం కావడం చరిత్రాత్మకమని రక్షణ మంత్రి ఏకే ఆంటోని పరవశంతో చెప్పారు. అప్పుడే ఒక పాకిస్థానీ పత్రిక తన సంపాదకీయంలో, ‘ఈ నౌకను రక్షణ దళంలో చేర్చుకోవడం చూస్తే పురాతన పద్ధతులలో ఆలోచించడం అక్కడి వ్యవస్థకి వ్యవసనంలా మారిందనిపిస్తోంది’ అని రాసింది. పేదరికంతో మగ్గిపోతున్న భారత్ ఇంత పెద్ద నౌకను తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకో? అంటూ అనవసరమైన విసుర్లు కూడా ఆ పత్రిక వదరింది. ఒకటి నిజం- ఇందులో మొదటి అంశం గురించి ఆ పాక్ పత్రిక బాహాటంగా చెప్పిన అభిప్రాయమే, చాలామంది భారతీయుల మనోగతం అంటే సత్యదూరం కాదు. రక్షణ వ్యవహారాలలో జాగరూకత ఆహ్వానించదగినదే. కానీ అణా కోడిపిల్లకి పావలా ఖరీదైన పందిపిల్లని దిష్టి తీసిన చందంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా స్వీయరక్షణలో పడక తప్పదు. నవంబర్ 16న నౌకాదళంలో భాగమైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య విషయంలో రక్షణ రంగం ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నది. ఈ యుద్ధ విమాన వాహక నౌక హిందూ మహాసముద్రంలో బలాబలాల సమతుల్యతలో మార్పులు తెచ్చేదేనని అభిప్రాయపడుతూనే భారత నౌకాదళ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్, ఆ నౌకను సొంతం చేసుకోవడానికి 250 శాతం అదనంగా ఖర్చు చేసిన సంగతిని కూడా ఉదహరించవలసి వచ్చింది. ఇదంతా పదమూడేళ్ల గాథ. ఐఎన్ఎస్ విక్రమాదిత్య సోవి యెట్ రష్యా కాలం నాటిది. అసలు పేరు అడ్మిరల్ గోర్ష్కొవ్ (అంతకుముందు పేరు బకు). యుఎస్ఎస్ఆర్ పత నం తరువాత 2000 సంవత్సరంలో భారత్-రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మనకు ‘బహుమానం’గా ఇచ్చేశారు. భారత నౌకాదళంలో భాగమయ్యే ముందే ఆధునీకరించాలని 2004లో నిర్ణయించారు. యుద్ధ విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేయడం అందులో ఒకటి. 974 మిలి యన్ డాలర్ల ఖర్చుతో ముస్తాబు చేసి రష్యా 2008 సంవత్సరానికి భారత్‌కు అప్పగించాలి. కానీ రష్యా ‘అనుకోని వ్యయాల’ పేరుతో భారత్‌కు చాలా చేతి చమురు వదిలిం చిందని ‘కాగ్’ విమర్శ. 250 శాతం ఖర్చు అలా పెరిగిందే. అన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే పశ్చిమ తీరంలోని కార్వార్ (కర్ణాటక) నౌకాశ్రయానికి చేరుతుంది. 44,500 టన్నుల బరువైన ఈ నౌక మీద 88 మిగ్ 29కె యుద్ధ విమానాలు నిలబడవచ్చు. విక్రమాదిత్య రాక చరిత్రాత్మకమని ఆంటోనీ వ్యాఖ్యానించగానే చాలామందికి మన రక్షణ వ్యవహారాల చరిత్ర లో మరో కోణం స్ఫురించింది. ముంబై నౌకా కేంద్రంలో ఉండగా ఐఎన్ఎస్ సింధురక్షక్ అనే జలాంతర్గామిలో జరిగిన పేలుళ్లు గుర్తుకు వచ్చాయి. 113 మిలియన్ డాలర్లు వెచ్చించి డిసెంబర్ 27, 1997లో భారత నౌకాదళంలోకి తీసుకువచ్చిన సింధురక్షక్ ఓ వైఫల్యం. ఇది రష్యా ఇచ్చిన కిలో-క్లాస్ 877 ఇకేఎం జాలాంతర్గామి. 2010లో ప్రమాదానికి గురైతే మళ్లీ రష్యా పంపారు. 80 మిలియన్ల డాలర్ల ఖర్చుతో మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం జూన్ ప్రాంతంలో తిరిగి వచ్చింది. సింధురక్షక్ ప్రమాదం రష్యా ప్రమాణాలనూ, మరమ్మతు సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేసిందని నేవీ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్ పేర్కొనడం విశేషం. రష్యా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలు సదా ఉత్తమమైనవి కావు, అవి విఫలం కావడానికి అవకాశాలూ ఎక్కువేనని ఆయన అభిప్రాయం. కిలో-క్లాస్ రష్యా అమ్మిన తొమ్మిదో జలాంతర్గామి మరి! రష్యాతో ఉన్న రక్షణ బాంధవ్యాన్ని సమీక్షించుకుంటే భారత్‌తో ఆ దేశం ఆడిన ప్రమాదకరమైన ఆట బయటపడుతుందని వాదిం చేవారూ ఉన్నారు. రష్యావే, మిగ్-21 యుద్ధ విమానాల వల్ల ఎందరు పైలట్లను కోల్పోయామో చాలా మంది గుర్తు చేస్తున్నారు. 900 మిగ్ -21 విమానాలకుగాను, సగానికిపైగా కూలిపోయాయి. అయితే భారతదేశం ఇంతవరకు తేలికపాటి యుద్ధవిమానాల తయారీ చేపట్టకపోవడంవల్ల మన వైమానిక దళం ఇప్పటికీ ఈ ‘రెక్కల శవపేటిక’లనే ఉపయోగిస్తూండటం మరో విషాదం. కూడంకుళం అణు విద్యుత్కేంద్రం కోసం తీసుకున్న రష్యా సాంకేతిక పరిజ్ఞానం మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతకీ విక్రమాదిత్యకు తనని తను రక్షించుకునే వ్యవస్థ ఏర్పడడానికి మరో నాలుగేళ్లు కావాలి. బాయిలర్ వ్యవస్థ పేలడంతో 1994లో ఇదే ఏడాది పాటు మూలప డింది. ఇన్ని లోపాలున్న రక్షణ దిగుమతులు అవసరమా? రష్యాది సాయమా? అక్కడ చెల్లని వాటిని అంటగట్టే తత్వ మా? రష్యాను మెప్పించడమే ప్రధానం అనుకుంటే, రక్షణ సంగతేమిటి? పాక్ పత్రిక వేసిన ప్రశ్న నిజానికి మన నేతలు వేసుకోవలసినది కాదా? కల్హణ -
నౌకాదళంలోకి ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’
రష్యా తీరంలో జరిగిన కార్యక్రమంలో అప్పగింత పాల్గొన్న రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ సెవెరోడ్విన్స్క్ (రష్యా): ఐదేళ్ల జాప్యం అనంతరం రష్యా ఆధునీకరించిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య భారత నౌకాదళంలోకి చేరింది. రష్యాలోని సెవెరోడ్విన్స్క్లో ఉన్న ఉత్తర ఆర్కిటిక్ పోర్టు సెవ్మాష్ షిప్‌యార్డులో శనివారం జరిగిన అప్పగింత కార్యక్రమంలో ఈ విమానవాహక నౌకను రష్యా అధికారులు భారత్‌కు అప్పగించారు. భారత రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ, రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్, ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోనీ మాట్లాడుతూ ఐఎన్ఎస్ విక్రమాదిత్య చేరికతో భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఈ నౌక 2014 ఫిబ్రవరిలో భారత్ చేరుకోనుందని రష్యా అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేకతలు... భారత నౌకాదళంలోకెల్లా అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు. దీని కొనుగోలుకు భారత్ రూ. 1.44 లక్షల కోట్లు వెచ్చించింది. ఇది ఏకకాలంలో 24 మిగ్-29 రకం యుద్ధ విమానాలు, 10 హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. రోజూ 1,300 కి.మీ. దూరం సముద్రయానం చేయగలదు. ఒకసారి ఇంధనం నింపితే 45 రోజులపాటు పనిచేస్తుంది. నౌక కార్యకలాపాలను 1,600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఇందులోని సిబ్బంది ఆహారం కోసం నెలకు 16 టన్నుల బియ్యం, 2 లక్షల లీటర్ల పాలు, లక్షకుపైగా గుడ్లు అవసరమవుతాయని అంచనా. రష్యా నౌకాదళంలో సేవలు... రష్యా 1987లో ఈ నౌకను ‘బకు’ పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్కోవ్ అని నామకరణం చేసింది. 1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్‌కు విక్రయించేందుకు ముందుకొచ్చింది. దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య సుమారు రూ. 60 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. రష్యా 2008లోనే దీన్ని భారత్‌కు అప్పగించాల్సి ఉన్నా నిర్మాణ వ్యయం పెరిగిందంటూ ఆధునీకరణ పనులను ఆపేయడంతో భారత్ మరింత సొమ్ము వెచ్చించేందుకు అంగీకరిస్తూ మరో ఒప్పందం కుదుర్చుకుంది.