
న్యూఢిల్లీ: భారత నావికా దళానికి చెందిన యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ నౌకాదళ అధికారి ప్రాణాలుకోల్పోయారు. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కర్వార్ యార్డ్‌కు వచ్చేటపుడు నౌకలో మంటలు చెలరేగాయి. లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో సిబ్బంది వేగంగా స్పందించి మంటలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించారు. ఈ క్రమంలో గాయాలపాలైన చౌహాన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఘటనపై నేవీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment