OFFICER DEAD
-
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: భారత నావికా దళానికి చెందిన యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ నౌకాదళ అధికారి ప్రాణాలుకోల్పోయారు. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కర్వార్ యార్డ్‌కు వచ్చేటపుడు నౌకలో మంటలు చెలరేగాయి. లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో సిబ్బంది వేగంగా స్పందించి మంటలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించారు. ఈ క్రమంలో గాయాలపాలైన చౌహాన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఘటనపై నేవీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
విధి నిర్వహణలో అధికారి మృతి
సిద్దిపేటజోన్: సిద్దిపేట జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి అంజయ్య విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందారు. బుధవారం పత్తి మార్కెట్లో ప్రభుత్వం మత్స్యకారులు, గొర్రెల కాపరులకు వివిధ పథకాల కింద వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అంజయ్య (56) మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సభావేదిక ప్రాంగణంలోనే కుప్పకూలారు. పక్కనే ఉన్న యాదవ సంఘం నాయకులు ఆయనను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అంజయ్య భార్య రాణిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృత దేహాన్ని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను హరీశ్‌రావు స్వయంగా పర్యవేక్షించారు. అంజయ్య మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సందర్శించారు. శుక్రవారం పట్టణంలోని వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. జనగామ జిల్లా కీలాసపూర్ గ్రామానికి చెందిన అంజయ్య ఎనిమిదేళ్లుగా జిల్లాలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఒక మంచి అధికారిని కోల్పోయామని.. అంజయ్య మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి దుర్మరణం
ఇటీవలే బాధ్యతల స్వీకరణ ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : ఉన్నత చదువులు చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఉప్పలగుప్తం మండలానికి చెందిన ఓ యువకుడు తన ఆశలు తీరకుండానే మృత్యువాత పడ్డాడు. ఉద్యోగంలో చేరి నెల రోజులు కా కుండానే అసువులు బాశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన అవివాహితుడైన పశువైద్యాధికారి ఆకుల నాగభూషణంనాయుడు (29) రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో ఇటీవలే ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగిం చుకుని శనివారం తన స్వగ్రామానికి మోటారు బైక్‌పై బయలుదేరా డు. మార్గమధ్యంలో మండల పరిధి లోని జె.అన్నవరం సమీపంలోకి రాగానే ఎదురుగా వసున్న వ్యా¯ŒS ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేçహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.