ముంబై: ఇండియన్ నౌక దళానికి కొత్త శక్తి తోడైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారు చేసిన 5వ శ్రేణి స్కార్పిన్ జలంతర్గామి ‘వగీర్’ని నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అరేబియా సముద్రంలోని మజగావ్ డాక్ వద్ద రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ వీడియో కాన్సరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఫ్రెంచి నౌక రక్షణ సంస్ధ డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో భారత నౌక దళ ప్రాజెక్ట్-75లో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఈ వగీర్ జలంతర్గామిని నిర్మించింది. భారత నౌక దళ అవసరాలకు అనుగుణంగా ఆరు స్కార్పిన్ జలంతర్గాములను నిర్మించడానికి మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌కు బాధ్యతలను అప్పగించింది. వీటిలో ఐఎన్‌ఎస్ కల్వరీని 2015లో మొదట ప్రారంభించగా, 2017 నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఖాందేరీ, కరంజ్, వేలా జలంతర్గాములను ప్రారంభించారు. (చదవండి:మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా )
‘వగీర్’ సేవలను వచ్చే సంవత్సరం నుంచి ఉపయోగించుకోవచ్చునని పశ్చిమ నౌక దళ వైస్ ఆడ్మిరల్ ఆర్‌బి పండిట్ అన్నారు. ‘ఇప్పటికే ఉన్న రెండు కల్వరీ జలంతర్గాములు చురుగ్గా పని చేస్తున్నాయి. మిగిలిన నాలుగు కూడా ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని’ ఆయన అన్నారు. ఈ రకం జలంతర్గాములు భూమిపైన, లోపల జరిగే యుద్ధాలలో సేవలు అందిచడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దేశాన్ని ముందుకు నడిపించే యుద్ధ నౌకల నిర్మాణంలో మజగావ్ డాక్ సంస్థ ముందుంటుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ గోదావరి యుద్ధ నౌకలు, రేస్ కార్లు, మిసైల్ బోట్స్ ఇతరేతర శత్రు వినాశనిలను తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment