సాక్షి, ముంబై: నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో అశ్వం అధిరోహించిన భారీ శివాజీ విగ్రహం (స్మారకం) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖకు పంపిన ప్రతిపాదనకు వారం రోజుల్లో ఆమోదం లభించే అవకాశాలుండడంతో పనులు ప్రారంభించడంపై దృష్టి సారించింది. ‘సముద్రం ఒడ్డు నుంచి కిలోమీటరున్నర లోపల నీటిపై భారీ ప్లాట్‌ఫారం నిర్మించనున్నాం. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని ఏర్పాటుచేస్తాం.
దీనికోసం రూ.1,400 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింద’ని ముంబై జిల్లా ఇన్‌చార్జి మంత్రి, స్మారక నిర్మాణ కమిటీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ బుధవారం మీడియాకు తెలిపారు. పనులు ప్రత్యక్షంగా ప్రారంభించిన తర్వాత పూర్తికావడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుందన్నారు. స్మారక నమూన (ఊహా చిత్రాన్ని) జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్ధులు రూపొందించారని వివరించారు. స్మారకాన్ని సందర్శించేవారు వెళ్లాల్సిన స్టీమర్ సేవలను కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
శివాజీ స్మారకం పనులపై సర్కార్ దృష్టి
Published Wed, Mar 5 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement