గ్వాదర్ పోర్టు నుంచి సరుకుల ఎగుమతి ప్రారంభం
ఇస్లామాబాద్: చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్‌లో పునరుద్ధరించిన గ్వాదర్ పోర్టు నుంచి ఆదివారం చైనా సరుకుల ఎగుమతి ప్రారంభమైంది. 250 కంటైనర్లతో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు సరుకులు చేరవేయడానికి చైనాకు వాణిజ్య నౌక గ్వాదర్ నుంచి బయలుదేరింది. బలూచిస్తాన్‌లోని ఈ పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రారంభించారు.
దీంతో పశ్చిమ చైనాను అరేబియా సముద్రంతో కలపాలన్న చైనా కల నెరవేరింది. చైనా ప్రారంభించిన వన్ బెల్ట్- వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఈ పోర్టును ప్రారంభించి తమ నిబద్ధతను చాటుకున్నామని, సీపీఈసీలో గ్వాదర్ పోర్టు కీలకమైనదని నవాజ్ పేర్కొన్నారు. సీపీఈసీలో భాగం గా చేయాల్సిన పనుల్ని గడువులోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
పాక్ నుంచి చైనా వ్యాపారం షురూ
Published Mon, Nov 14 2016 1:07 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM
Advertisement
Advertisement