Nawaz
-
పాక్‌లో నవాజ్- బిల్వాల్ ప్రభుత్వం?
పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’(పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. పాక్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాలేదు. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థులు 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ పార్టీ 71 సీట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 134 స్థానాల్లో మెజారిటీ అవసరం. ఈ నేపధ్యంలో పీపీపీ, పీఎంఎల్-ఎన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని సమాచారం. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ లాహోర్‌లో పీఎన్ఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పాక్ ప్రధానిగా స్వతంత్ర అభ్యర్థి?
పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండటం రాజకీయ పండితులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్‌లో గత 24 గంటలుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జాతీయ అసెంబ్లీలోని మొత్తం 266 స్థానాలకుగాను స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపు 99 స్థానాల్లో విజయం సాధించారు. ఈ స్థానాల్లో చాలా వరకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పీఎంఎల్ఎన్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్) 71 సీట్లు, పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) 53 సీట్లు గెలుచుకున్నాయి. ఇంకా కొన్ని సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో పాకిస్తాన్లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థుల ప్రభుత్వం ఏర్పడనుండే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెజారిటీ మార్కును తాకకపోవడంతో పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీటీఐ మద్దతు కలిగిన అభ్యర్థులు మెజారిటీతో గెలిస్తే, వారు తమ సొంత గ్రూపును ఏర్పాటు చేసి, దానికి ఇన్సాఫ్ గ్రూప్ లేదా మరేదైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
మానవత్వమే అతడి పాలిట మృత్యువై..
మహబూబ్‌నగర్: మానవత్వమే అతడి పాలిట మృత్యువైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం ఇద్దరి జీవితాలను ఛిద్రం చేయడమే గాక.. వారి కుటుంబసభ్యుల ఆశలను సమాధి చేసింది. ఈ విషాదకర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి నర్సింహులు, ఎస్ఐ రమేష్ వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవాజ్ (25) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 11 నెలల కిందట వివాహం కాగా.. 10 రోజుల క్రితం కూతురు జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బైక్‌పై తన అత్తగారి ఊరైన జడ్చర్ల పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరగా.. మండలంలోని మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ హెల్పర్ అశోక్ (30) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నవాజ్‌ను గమనించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా.. కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నవాజ్‌తో పాటు అశోక్‌కు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. అశోక్‌ది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. పాల వ్యాన్ డ్రైవర్ నర్సింహులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను కల్వకుర్తి మార్చురీకి తరలించారు. కాగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఇరువురి కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్ డ్రైవర్ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కనిమెట్టలో విషాదఛాయలు.. కొత్తకోట మండలంలోని కనిమెట్టకు చెందిన చీర్ల నాగమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు అశోక్ కొంత కాలంగా గ్రామ సమీపంలోని ఓ డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీకి చెందిన లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అశోక్ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి కూడా చదవండి: బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుల దుర్మరణం! -
67కు పెరిగిన విషాహార బాధితులు
నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం బండ్లపై గ్రామంలో శుక్రవారం రాత్రి విషాహారం తిని అనారోగ్యం బారినపడ్డ వారి సంఖ్య 67కి చేరుకుంది. ప్రతి మూడేళ్లకోసారి బండ్లపై హరిజనవాడ, దుర్గంవారిపల్లె, బండ్లపై కాలనీ, పారాశివారిపల్లె గ్రామస్తులు ఏకమై గంగజాతర నిర్వహిస్తారు. అందులో భాగంగా బండ్లపై గ్రామ ప్రజలు గురువారం రాత్రి అమ్మవారిని ఊరేగించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులు, స్థానికులు సామూహిక భోజనాలు చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత భోజనం చేసినవారు రాత్రి 10 గంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని 108లో నిమ్మనపల్లె, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సింగిల్ విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. అంతమంది ఆస్పత్రిలో చేరినా శుక్రవారం రాత్రి విధులకు హాజరుకాకపోవడంతో మెడికల్ ఆఫీసర్ జులేఖబేగంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విష ఆహారం ఘటనపై మదనపల్లె డివిజన్ ఆహార కల్తీ నియంత్రణాధికారి రాముడు విచారణ చేపట్టారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
పాక్ నుంచి చైనా వ్యాపారం షురూ
గ్వాదర్ పోర్టు నుంచి సరుకుల ఎగుమతి ప్రారంభం ఇస్లామాబాద్: చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్‌లో పునరుద్ధరించిన గ్వాదర్ పోర్టు నుంచి ఆదివారం చైనా సరుకుల ఎగుమతి ప్రారంభమైంది. 250 కంటైనర్లతో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు సరుకులు చేరవేయడానికి చైనాకు వాణిజ్య నౌక గ్వాదర్ నుంచి బయలుదేరింది. బలూచిస్తాన్‌లోని ఈ పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. దీంతో పశ్చిమ చైనాను అరేబియా సముద్రంతో కలపాలన్న చైనా కల నెరవేరింది. చైనా ప్రారంభించిన వన్ బెల్ట్- వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఈ పోర్టును ప్రారంభించి తమ నిబద్ధతను చాటుకున్నామని, సీపీఈసీలో గ్వాదర్ పోర్టు కీలకమైనదని నవాజ్ పేర్కొన్నారు. సీపీఈసీలో భాగం గా చేయాల్సిన పనుల్ని గడువులోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. -
ఖ్వాజా బందే నవాజ్ దర్గా గుల్బర్గా
పుణ్య క్షేత్రం ప్రతి మనిషీ దేవుని సంతానమే. ప్రతి మనిషీ ఇంకో మనిషిని ప్రేమించాలి. మతం ఏదైనా కులం ఏదైనా సమూహం ఏదైనా మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం... అని బోధించిన మహనీయుడు ఖ్వాజా బందే నవాజ్. ‘బందా’ అంటే ‘మనిషి’. ‘నవాజ్’ అంటే ‘ప్రియమైన’... ఆయన మనుషులకు ప్రియమైన వాడు. మనుషులను ప్రియమైనవారిగా చూసేవాడు. ఆయన మనుషులను అక్కున చేర్చుకునే మహనీయుడు. గుల్బర్గా చీకూ చింతా లేని ఊరు. ఎదగడానికి తొందరపడే ఊరులా కనిపించదు. ప్రశాంతమైన జనం... తీరిగ్గా ఉండే జీవనం. దిగిన వెంటనే మనకు ‘హాఫ్ ఆటో’ అనే మాట వినిపిస్తుంది. ‘షేర్ ఆటో’కు అది అక్కడ సమానార్థకం. ఆఫ్ ఆటోలో ఎక్కితే పది రూపాయలకు కావలసిన దూరంలో దింపుతారు. ‘ఫుల్ ఆటో’ అంటే మనకు మాత్రమే. అప్పుడు మనం బేరం చేసుకుని కావలసిన చోటుకు మాట్లాడుకోవాలి. నలభై రూపాయలకు చాలా దూరం వస్తారు. వంద రూపాయలకు దాదాపు ఊరు చుట్టేయొచ్చు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా 220 కిలోమీటర్ల దూరం. ముంబై వెళ్లే ట్రైన్లన్నీ ఇక్కడ ఆగుతాయి. మధ్యాహ్నం ‘పూణె శతాబ్ది’ ఉంది. ఎక్కితే మూడున్నర గంటల్లో శ్రమ లేకుండా దించుతుంది. స్టేషన్ నుంచి నాలుగడుగుల దూరంలోనే హోటల్స్ ఉన్నాయి. భారీ హోటల్స్ కాదు. మధ్యస్తంవి. ఉండొచ్చు. ఊళ్లో ఒక మంచి హోటల్ ఉంది. దానికి మాత్రం ముందే బుక్ చేసుకొని వెళ్లడం ఉత్తమం. లేకుంటే రూములు దొరకవు. హైదరాబాద్ నుంచి వెహికిల్ మాట్లాడుకుని వెళ్లేవాళ్లే ఎక్కువ. వికారాబాద్, వాడి మీదుగా శ్రమ లేకుండా చేరుకోవచ్చు. కలబురగి.... గుల్బర్గా అసలు పేరు కలబురగి అని అంటారు. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఆ రాజ్యం కింద ఉంది. ఇక్కడ ఆ కాలం నాటి కోట ఉంది. గట్టి రాతితో కట్టిన కోటను ‘కలబురగి’ అన్నారు. అదే ఆ ఊరి పేరైంది. అయితే ఆ తర్వాత వచ్చిన బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. అప్పుడు వారు ఆ ఊరిని అధికారికంగా ‘ఎహసేనాబాద్’ అని పెట్టుకున్నా ‘గుల్’ అనగా పూలతోటలు ఉన్న ఊరు కనుక జనసామాన్యంలో ‘గుల్బర్గా’ అన్నారు. చాలా కాలం అదే పేరు కొనసాగినా తాజా కర్ణాటక ప్రభుత్వం మళ్లీ పాత పేరును అధికారిక పేరుగా మార్చింది. కనుక ఊళ్లో ప్రభుత్వ బోర్డులు కలబురగి అని, ప్రజల బోర్డులు గుల్బర్గా అని ఉంటాయి. దర్గా... గల్బర్గా- దేశం మొత్తానికి అక్కడ ఉన్న దర్గా వల్లే ప్రసిద్ధి. మన దేశంలో ఎక్కువ ప్రాముఖ్యం కలిగిన దర్గాగా రాజస్తాన్‌లో ఉన్న అజ్మీర్ దర్గాను భావిస్తారు. అక్కడ ఉన్న సూఫీ గురువును ఖ్వాజా గరీబ్ నవాజ్ అని పిలుస్తారు. గరీబ్ అంటే పేద. ఆయన పేదల పెన్నిధి. దక్షిణాదిన ఉన్న గుల్బర్గా దర్గాలో ఉన్న సూఫీ గురువును బందే నవాజ్ అని పిలుస్తారు. అసలు పేరు... ఖ్వాజా బందే నవాజ్ అసలు పేరు సయ్యద్ ముహమ్మద్ హుసేని. భక్తులు ఆయనను ‘హజరత్ ఖ్వాజా బందే నవాజ్ గైసు దరజ్’ అని పిలుచుకుంటారు.‘ఖ్వాజా’ అంటే ‘గురువు’ అని అర్థం. బందే నవాజ్ 14-15 శతాబ్దాల కాలంలో జీవించారు. వీరి పూర్వికులది ఇస్లామీయ మహాపురుషులలో ఒకడైన హజరత్ అలీ వంశం అని భావిస్తారు. ఆ వంశానికి చెందినవారు ఢిల్లీకి వచ్చి స్థిరపడగా అక్కడ బందే నవాజ్ జన్మించారు. ఈయనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు వీరి కుటుంబం దౌలతాబాద్ వెళ్లిపోయింది. అక్కడే పదిహేనేళ్ల వరకూ ఉండి ఇస్లామీయ విద్యపై మక్కువతో ఢిల్లీలో ఉన్న సూఫీ గురువు హజరత్ నసీరుద్దీన్ చిరాగ్ దెహల్వి దగ్గర శిష్యరికానికి వచ్చారు. హజరత్ నసీరుద్దీన్ ప్రఖ్యాత సూఫీ గురువు హజరత్ నిజాముద్దీన్‌కు శిష్యులు. ఆగని చదువు... బందే నవాజ్ తన గురువు నసీరుద్దీన్ దగ్గర విద్యను అభ్యసించారు. అది ఒక స్థాయికి చేరుకుంది. ఇక నేను చదువు ఆపవచ్చునా అని గురువును అడిగారట. నిజానికి అంతటితో ఆపితే నష్టం లేదు. కాని ఆ గురువు- లేదు.. కొనసాగించు నీ నుంచి నేను చాలా ఆశిస్తున్నాను అన్నారట. ఆ తర్వాత బందే నవాజ్ తన ఆధ్యాత్మిక చదువును మరింత లోతులకెళ్లి కొనసాగించారు. ఆయన 105 సంవత్సరాలు జీవించారు. తన జీవితకాలంలో 105 విశిష్టమైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. ఏవీ కలం పట్టి రాయలేదు. చెప్తూ ఉండగా సహాయకుడు రాసి పెట్టడమే. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేయనున్నాడని బందే నవాజ్ జోస్యం చెప్పినట్టుగా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేసి ఆ నగరాన్ని సర్వనాశనం చేసినప్పుడు బందేనవాజ్ను బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తన గుల్బర్గాకు వచ్చి ఉండిపోవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. అలా తన 76వ ఏట గుల్బర్గా వచ్చిన బందే నవాజ్ అక్కడే 105 సంవత్సరాల వరకూ జీవించి క్రీ.శ. 1422లో దైవ సన్నిధికి చేరుకున్నారు. మనసును తాకే ప్రశాంతత... గుల్బార్గా దర్గాకు స్టేషన్ నుంచి అరవై రూపాయలు ఆటో చెల్లించి చేరుకోవచ్చు. దర్గా ఊళ్లో కొంచెం లోపలి ప్రాంతంలో ఉంటుంది. దర్గా ఆవరణలో పూల దుకాణాల వారు పూల చాదర్లు అమ్ముతుంటారు. వాటిని కొని దర్గాలో సమర్పించవచ్చు. దేశంలో చాలా దర్గాలు ఉన్నాయి. కాని గుల్బర్గా దర్గా ఎంతో విశాలమైన ప్రశాంతమైన దర్గా అనిపిస్తుంది. గురుసమాధి ఉన్న టూంబ్ ఎంతో విశాలంగా ఏ.సిలు బిగించి తొడతొక్కిడి లేని దర్శనం కలిగి హాయిగా ఉంటుంది. మనసులో ఉన్నది నివేదించుకుంటే నెరవేరుతుందని నమ్మిక. అసలు హోటళ్లు అవసరం లేకుండా దర్గాలోనే నిద్ర చేసే వీలుంది. దర్గా ఆవరణలోని విశాలమైన షెడ్లు రాత్రిళ్లు నిద్రపోవడానికి వీలుగా ఉంటాయి. భక్తుల కోసం స్నానాల గదులు, టాయిలెట్లు ఉన్నాయి. చాలామంది భక్తులు హోటల్ గదుల జోలికి పోకుండా రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోతారు. అన్ని మతాల కూడలి... గుల్బర్గా దర్గాకి అన్ని మతాల వాళ్లు వస్తారు. ఖ్వాజా బందే నవాజ్ చెప్పినట్టుగా మనిషిని మనిషి ప్రేమించడానికి మతం అడ్డుకాదు అనే భావనకు ఆ తావు ఒక సాక్ష్యం పలికినట్టు ఉంటుంది. గుల్బర్గాలో బస చేసి తెల్లవారు జామున దర్గాను సందర్శించి చూడండి. మీ మనసుకు అమితమైన ప్రశాంతత చేకూరుతుంది. మీ ఆందోళనలన్నీ చెదిరి పోయి మీ ధైర్యం స్థిరపడి ముందుకు వెళ్లే స్థిమితత్వం వస్తుంది. గురుమార్గం- తప్పక అనుసరణీయమైన మార్గం. - కెవికె కుమార్ ఆయన మహిమను చూస్తారా..? బందేనవాజ్ తన గురువుకు సేవ చేసే సమయంలో కురులను పొడవుగా పెంచారట. ఒకసారి గురువును పల్లకీలో మోసుకుంటూ వెళుతూ ఉండగా ఆ కురులు పల్లకీ అంచులో చిక్కుకుపోయాయి. ఎంతో నొప్పి కలుగుతున్నా గురువుకు అంతరాయం కలుగుతుందని ఆ సంగతి చెప్పలేదు. సాధారణంగా మిగిలిన బోయీలు చేయి మార్చుకుంటారు. తన కురులు చిక్కుకుపోవడం వల్ల మరొకరికి భుజం మార్చకుండా అలాగే పల్లకీని మోశారు. ఈ సంగతి తెలిసి గురువు పులకించి పోయి ‘గైసు దరజ్’ బిరుదు ఇచ్చారు. బందే నవాజ్ సమక్షంలో ఒక అనుయాయి ఒక వ్యక్తిని ‘నువ్వు’ అని సంబోధించాడు. దానికి బందే నవాజ్ అభ్యంతరం చెప్పారు. ‘అతడు హిందువు. కనుక నువ్వు అన్నాను’ అన్నాడు అనుయాయీ. ‘దానికంటే ముందు అతడు మనిషి. మనిషిని గౌరవించు’ అని హితవు చెప్పారు బందే నవాజ్. బందే నవాజ్ మహిమాన్వితం పట్ల అనుమానాలున్న ఒక పెద్ద మనిషి ఒకసారి బందేనవాజ్ను దర్శించడానికి వచ్చి ఆ సమయంలో ఆయన చేతిలో ఉన్న విసన కర్రను చూసి ఇది నాకు ఇస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు బందే నవాజ్ ఆ పెద్ద మనిషితో ‘ఒక ఊళ్లో ఒక గాడిదకి దొంగలని పట్టడం తెలుసు. దాని కళ్లకు గంతలు కట్టి అనుమానితుల దగ్గర వదిలేస్తే అది నేరుగా వెళ్లి దొంగ కట్టుకున్న పంచెను పట్టుకుని లాగుతుంది. మహిమలు చూపితే నేనూ ఆ గాడిదతో సమానం అవుతాను. ఇదిగో విసనకర్ర కోరుకున్నావుగా. తీసుకెళ్లు’ అని ఇచ్చేశారు. ఒక ముసలామె బందే నవాజ్ మహిమను ఎగతాళి చేయదలచి జనాజా (శవవాహనం)లో తన కొడుకును పడుకోబెట్టి నలుగురితో కూడి బందే నవాజ్ దగ్గరకు వచ్చి నా కొడుకు చనిపోయాడు... జనాజా నమాజు చదవండి అని ప్రాధేయపడింది. ఆయన నమాజు చదవడం మొదలెడితే కొడుకు నవ్వుతూ లేచి నిలబడి ఆయనను ఎగతాళి చేయాలని ఉద్దేశ్యం. బందే నవాజ్ జనాజా నమాజు చదివారు. నమాజు పూర్తయినా కొడుకు లేవలేదు. తల్లి వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు. చేసిన తప్పుకు లెంపలు వేసుకుని ఆమె బందే నవాజ్ కాళ్ల మీద పడింది. బందే నవాజ్ ఆమెను క్షమించిన మరుక్షణం కొడుకు శరీరం ప్రాణంతో కదిలింది. -
నవరాత్రి వేడుకల్లో విద్యాబాలన్
ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరోయిన్స్ షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న దుర్గా నవరాత్రి వేడుకల్లో తారల సందడి బాగా కనిపిస్తోంది. ఎప్పుడు మోడ్రన్ డ్రెస్‌లలో హాట్ హాట్‌గా కనిపించే తారలు, ట్రెడిషనల్ లుక్‌లో హుందాగా దర్శనమిస్తున్నారు. ప్రజెంట్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్, ఈ లిస్ట్ ఎక్కువగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ లేడి ఓరియంటెడ్ సినిమాలను సక్సెస్ ఫార్ములాగా మార్చిన విద్యాబాలన్, విశ్వజిత్ ఛటర్జీ కుటుంబం నిర్వహించిన దుర్గమాత పూజలో పాల్గొంది. ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి నటిస్తున్న విద్య ట్రెడిషనల్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంది. బెంగాలీ తరహా వస్త్రదారణతో విద్యాబాలన్ హుందాగా కనిపించింది. -
కిడ్నాప్ చేసి చంపిన స్నేహితులు