పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’(పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది.
పాక్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాలేదు. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థులు 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ పార్టీ 71 సీట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 134 స్థానాల్లో మెజారిటీ అవసరం. ఈ నేపధ్యంలో పీపీపీ, పీఎంఎల్-ఎన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని సమాచారం. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ లాహోర్‌లో పీఎన్‌ఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment