bilwal bhutto
-
పాక్‌లో నవాజ్- బిల్వాల్ ప్రభుత్వం?
పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’(పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. పాక్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాలేదు. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థులు 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ పార్టీ 71 సీట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 134 స్థానాల్లో మెజారిటీ అవసరం. ఈ నేపధ్యంలో పీపీపీ, పీఎంఎల్-ఎన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని సమాచారం. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ లాహోర్‌లో పీఎన్ఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పాక్ రాజకీయాల్లోకి యువ కిరణం
ఇస్లామాబాద్: తన భార్య పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనర్జీర్ భుట్టో తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తనయుడు బిల్వాల్ భుట్టో జర్దారీని పార్లమెంటు స్ధాయి రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి బెనర్జీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా పార్టీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది. పార్లమెంటులో బిల్వాల్ ప్రవేశం కోసం కొద్ది రోజుల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన ఓ ఎంపీ రాజీనామా చేస్తారని అక్కడి మీడియా పేర్కొంది. ఆ తర్వాత బిల్వాల్ సదరు ఎంపీ స్ధానం నుంచి ఉప ఎన్నికల్లో పీపీపీ తరఫు పోటీలో నిలబడతారని చెప్పింది. మరి బిల్వాల్ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెడతారా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ బిల్లాల్ ఉప ఎన్నికల్లో నెగ్గితే మాత్రం పాకిస్తాన్ రాజకీయాలు శరవేగంగా మారతాయనడంలో సందేహం లేదు. -
'చెల్లెళ్లు చూపిన అమ్మాయినే చేసుకుంటా'
న్యూఢిల్లీ: తన చెల్లెళ్లు చూపిన అమ్మాయినే వివాహం చేసుకుంటానని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో జర్దారీ కుమారుడు బిల్వాల్ భుట్టో జర్దారీ(28) శనివారం మీడియాతో పేర్కొన్నారు. బిల్వాల్ ప్రస్తుతం పాకిస్తానీ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ గా, పార్టీ కేంద్ర కార్యనిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తనకు ఇప్పటివరకూ చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని చెప్పుకొచ్చిన ఈ యువ పొలిటీషియన్ వాటన్నింటిని తిరస్కరించినట్లు చెప్పారు. తన చెల్లెళ్లు భక్తావర్ భుట్టో జర్దారీ, ఆసిఫా భుట్టో జర్దారీలు చూపిన అమ్మాయినే తాను వరిస్తానని స్పష్టం చేశారు. తనను చేసుబోయే అమ్మాయి తన చెల్లెళ్ల మన్ననలు పొందగలగాలని చెప్పారు. అయితే అది అంత సులువు కాదని అన్నారు. బిల్వాల్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ లోని ప్రముఖ రాజకీయ నేతలు భిన్నంగా స్పందించారు. పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందే వివాహం చేసుకోవాలని నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అబిద్ షేర్ అలీ.. బిల్వాల్ కు సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో రాజకీయ కుట్రలను అడ్డుకోవచ్చని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ లా రెండు పెళ్లిళ్లు చేసుకోవద్దని బిల్వాల్ కు సూచించారు. ప్రేమ కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలని మరో ముత్తాహిదా కౌమి నాయకుడు రవూఫ్ సిద్దిఖీ.. బిల్వాల్ కు సూచించారు. నచ్చిన అమ్మాయిని వరించాలని లేకపోతే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. 2019 వరకూ బిల్వాల్ కు వివాహం జరిగే అవకాశంలేదని ఓ జోతిష్యుడు పేర్కొన్నారు. బిల్వాల్ జాతకంలో నక్షత్రాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. వివాహం విషయంలో అచ్చు ఇమ్రాన్ ఖాన్ ను పోలిన జాతకాన్ని బిల్వాల్ కలిగివున్నారని చెప్పారు. బిల్వాల్ ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకుంటారని కూడా పేర్కొన్నారు.