పాక్ రాజకీయాల్లోకి యువ కిరణం
పాక్ రాజకీయాల్లోకి యువ కిరణం
Published Tue, Dec 27 2016 5:23 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
ఇస్లామాబాద్: తన భార్య పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనర్జీర్ భుట్టో తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తనయుడు బిల్వాల్ భుట్టో జర్దారీని పార్లమెంటు స్ధాయి రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి బెనర్జీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా పార్టీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది.
పార్లమెంటులో బిల్వాల్ ప్రవేశం కోసం కొద్ది రోజుల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన ఓ ఎంపీ రాజీనామా చేస్తారని అక్కడి మీడియా పేర్కొంది. ఆ తర్వాత బిల్వాల్ సదరు ఎంపీ స్ధానం నుంచి ఉప ఎన్నికల్లో పీపీపీ తరఫు పోటీలో నిలబడతారని చెప్పింది. మరి బిల్వాల్ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెడతారా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ బిల్లాల్ ఉప ఎన్నికల్లో నెగ్గితే మాత్రం పాకిస్తాన్ రాజకీయాలు శరవేగంగా మారతాయనడంలో సందేహం లేదు.
Advertisement