పాక్‌ మాజీ అధ్యక్షుడు అరెస్టు | Former Pak President Asif Ali Zardari Arrested | Sakshi
Sakshi News home page

పాక్‌ మాజీ అధ్యక్షుడు అరెస్టు

Published Mon, Jun 10 2019 6:31 PM | Last Updated on Mon, Jun 10 2019 6:33 PM

Former Pak President Asif Ali Zardari Arrested - Sakshi

ఇస్లామాబాద్‌ : నకిలీ బ్యాంకు అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో భర్త ఆసిఫ్‌ అలీ జర్దారీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అలీతో పాటు.. ఆయన సోదరి ఫర్యాల్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పీటీఐ వెల్లడించింది. కాగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అలీ నిర్వహిస్తున్న లావాదేవీలపై నేషనల్‌ అకౌంటబిలిటి బ్యూరో(అవినీతి నిరోధక శాఖ) అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పలు నకిలీ అకౌంట్ల ద్వారా సోదరితో కలిసి సుమారు 150 మిలియన్‌ డాలర్ల నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అలీతో పాటు ఆయన సోదరిని అదుపులోకి తీసుకోవాలని ఎన్‌ఏబీ నిర్ణయించింది. దీంతో ఆయనను సోమవారం అరెస్టు చేశారు.

కాగా ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్న అలీ.. దానిని పొడిగించాలని కోరుతూ ఇస్లామబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి అత్యున్నత న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అలీని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన సోదరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement