పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండటం రాజకీయ పండితులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్‌లో గత 24 గంటలుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
జాతీయ అసెంబ్లీలోని మొత్తం 266 స్థానాలకుగాను స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపు 99 స్థానాల్లో విజయం సాధించారు. ఈ స్థానాల్లో చాలా వరకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పీఎంఎల్‌ఎన్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్) 71 సీట్లు, పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) 53 సీట్లు గెలుచుకున్నాయి. ఇంకా కొన్ని సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో పాకిస్తాన్‌లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థుల ప్రభుత్వం ఏర్పడనుండే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మెజారిటీ మార్కును తాకకపోవడంతో పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీటీఐ మద్దతు కలిగిన అభ్యర్థులు మెజారిటీతో గెలిస్తే, వారు తమ సొంత గ్రూపును ఏర్పాటు చేసి, దానికి ఇన్సాఫ్ గ్రూప్ లేదా మరేదైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment