పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు ఇమ్రాన్‌ఖాన్.. ఇటు నవాజ్ షరీఫ్ విజయం తమదేనని చెబుతున్నారు. ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంపై పాకిస్తాన్ ఎన్నికల సంఘంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాక్ మాజీ ప్రధాని, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (సీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత ‘విక్టరీ స్పీచ్’ను విడుదల చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’ (పిఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ ‘లండన్ ప్లాన్’ విఫలమైందని, పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని ఇమ్రాన్ పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ‘నా ప్రియమైన దేశప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్ ప్లాన్’ విఫలమైంది’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఇమ్రాన్ జైలులో ఉన్నా.. పాక్ యువత ఎందుకు మద్దతు పలికింది?
Comments
Please login to add a commentAdd a comment