Indipendend candidates
-
పాక్ ప్రధానిగా స్వతంత్ర అభ్యర్థి?
పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండటం రాజకీయ పండితులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్‌లో గత 24 గంటలుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జాతీయ అసెంబ్లీలోని మొత్తం 266 స్థానాలకుగాను స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపు 99 స్థానాల్లో విజయం సాధించారు. ఈ స్థానాల్లో చాలా వరకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పీఎంఎల్ఎన్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్) 71 సీట్లు, పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) 53 సీట్లు గెలుచుకున్నాయి. ఇంకా కొన్ని సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో పాకిస్తాన్లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థుల ప్రభుత్వం ఏర్పడనుండే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెజారిటీ మార్కును తాకకపోవడంతో పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీటీఐ మద్దతు కలిగిన అభ్యర్థులు మెజారిటీతో గెలిస్తే, వారు తమ సొంత గ్రూపును ఏర్పాటు చేసి, దానికి ఇన్సాఫ్ గ్రూప్ లేదా మరేదైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
విజయవాడలో పుర‘పోల్’ సిత్రాలివే!
సాక్షి, అమరావతి బ్యూరో: తాజాగా జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశా యి. ఈ ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటంటే ఒక్క ఓటూ పడలేదు. అంటే వారి ఓటు కూడా వారు వేసుకోలేదన్న మాట! నగరంలోని 9వ డివిజన్లో బొల్లినేని లక్ష్మీ సంధ్య, 46వ డివిజన్లో దిల్ షాద్ బేగంలు ‘0’ ఓట్లు సాధించిన ఘనతను చాటుకున్నారు. అలాగే 9వ డివిజన్‌లోనే కన్నా లక్ష్మి, 59వ డివిజన్లో ఎండీ వహీదా పర్వీన్, 60వ డివిజన్లో ఎండీ నజీమాలకు ఒక్కొక్క ఓటు మాత్రమే పోలయ్యాయి. రెండేసి ఓట్లు తెచ్చుకున్న వారిలో 60వ డివిజన్లో ఎం. మాధవి, 31వ డివిజన్లో కె.విజయశ్రీలు ఉన్నారు. ఇక 20వ వార్డులో జె.బాలాజీ, 40వ డివిజన్లో సీహెచ్. రామునాయుడులు మూడేసి ఓట్లు లభించాయి. ఇలా నాలుగు ఓట్లు తెచ్చుకున్న వారు ఐదుగురు, ఐదుఓట్లు లభించిన వారు ఏడుగురు, ఆరు ఓట్లు వచ్చిన వారు ఒక రు, ఏడు ఓట్లు పోలైన వారు ఆరుగురు, ఎనిమిది ఓట్లు దక్కిన వారు ఐదుగురు, తొమ్మిది ఓట్లు పొందిన వారు ఒకరు, పది ఓట్లు వచ్చిన వారు ఒకరు చొప్పున ఉన్నారు. ఇలా విజయవాడ నగరపాలకసంస్థలో వివిధ డివిజన్లలో పది లోపు ఓట్లను పొందిన స్వతంత్ర అభ్యర్థులు 35 మంది ఉన్నారు. వీరిలో 24 మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం! ఇదీ సంగతి..! కొందరు అభ్యర్థులు అత్యల్పంగా ఓట్లు తెచ్చుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు డమ్మీ అభ్యర్థులతోనూ వేయిస్తారు. ఉపసంహరణ సమయంలో డమ్మీ అభ్యర్థులు బరి నుంచి తప్పిస్తారు. దీంతో బరిలో అసలు అభ్యర్థులే మిగులుతారు. అయితే కొంతమంది ప్రధాన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగాను, బూత్ ఏజెంట్లుగాను పనికొస్తారన్న ఉద్దేశంతో వారిని కొనసాగిస్తారు. ఇలాంటి వారిని నిబంధనల ప్రకారం అధికారులు స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. వీరు తమ ఓటును కూడా తమకు వేసుకోరు. దీంతో వీరికి ‘0’ ఓట్లు పడినట్టు రికార్డుల్లోకి ఎక్కుతారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వేస్తే మాత్రం స్వల్ప ఓట్లు వీరి ఖాతాలో జమ అవుతాయ. అయితే మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే నామినేషన్లు దాఖలు చేస్తారు. ఫలానా ఎన్నికల్లో పోటీ చేశాను.. అని చెప్పుకోవడానికి అలా వేస్తుంటారు. అలాంటి వారు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయరు. తనకు ఓటేయమని జనంలోకి వెళ్లి అడగరు. వీరికి తన ఓటుతో పాటు తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల ఓట్లు నామమాత్రంగా పడతాయి. చర్చకు దారితీస్తాయి. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. -
ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు.. విషమం
పట్నా : మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిహార్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హయ్‌గ్ఘ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రవీంద్రనాథ్ అలియాస్ చింటూ సింగ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున దర్భంగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తుపాకీ తుటాలకు గురైన అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దర్భాంగా మెడికల్ కాలేజీల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. ఘటనపై దర్యాప్తుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాయని.. విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. (మోదీలా ట్రంప్ చేయలేకపోయారు) గతంలో జేడీయూలో కొనసాగిన రవీంద్ర ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన ప్రత్యర్థులు ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా బిహార్లోశనివారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. దీంతో నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
చిన్న పార్టీల దారెటు?
ముంబై: ఫడ్నవీస్ ప్రభుత్వం త్వరలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇటీవలి ఎన్నికల్లో చిన్న పార్టీల నుంచి 16 మంది, స్వతంత్రులు 13 మంది ఎమ్మెల్యేలయ్యారు. అసెంబ్లీలోని మొత్తం 288 మందిలో మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ ‘ఇతర’ ఎమ్మెల్యేల్లో తమ వైపు ఏడుగురున్నారని శివసేన, తమవైపు 14 మంది ఉన్నారని బీజేపీ చెబుతున్నాయి. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌కు ఎన్సీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది ఇప్పటి వరకు కచ్చితంగా వెల్లడి కాలేదు. అయితే, వీరు కాకుండా పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కమలదళం చెబుతోంది. ఆ నలుగురు కీలకం బలపరీక్ష నేపథ్యంలో.. మేజిక్ మార్క్ 145కి చేరేందుకు బీజేపీ ముఖ్యంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. వారు నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించినవారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో ప్రత్యక్ష సంబంధాలున్నావారు. గణేశ్ నాయక్, బాబన్‌రావు మాజీ ఎన్సీపీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలున్నవారు. అందుకే బీజేపీ వీరిపై ఆధారపడుతోంది. -
కొంప ముంచిన గాడిద సవారీ
ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు మందీ మార్బలంతో వెళుతుంటారు. కొందరు డజన్ల సంఖ్యలో కార్లతో వెళ్లి నామినేషన్లు వేస్తే మరి కొందరు గుర్రాల మీద, ఎడ్ల బండి పైన వచ్చి నామినేషన్లు వేస్తారు. అయితే, బిహార్‌కు చెందిన మణి భూషణ శర్మ అందరికంటే విలక్షణంగా ఉండాలని, అందరినీ ఆకర్షించాలని ఏకంగా గాడిదపై ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు.అయితే,ఆయన గాడిద సవారీ ఎంత మందిని ఆకట్టుకుందో తెలియదు కాని అధికారులకు మాత్రమే నచ్చలేదు. దాంతో జంతువుని హింసించాడంటూ శర్మపై కేసు పెట్టారు. బిహార్‌లోని హలస్‌నగర్ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల మణిభూషణ్ జెహనాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా లోక్‌సభకు పోటీ చేయాలని ఆశించారు. ఏడో దశలో అంటే మే 19న పోలింగు జరిగే ఈ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు. ఆ రోజున గాడిదపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయనాయకులు ప్రజల్ని గాడిదల్లా చూస్తున్నారన్న సంగతి తెలియజేయడానికే తాను గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్టు శర్మ చెప్పారు. అయితే, ఎన్నికల అధికారులకు ఈ గాడిద సవారీ నచ్చలేదు. శర్మపై సర్కిల్ అధికారి సునీల్ కుమార్ జంతు హింస నివారణ చట్టం కింద కేసు పెట్టారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. పోనీ విధం చెడ్డా ఫలమైనా దక్కిందా అంటే అదీ లేదు. సాంకేతిక కారణాల వల్ల శర్మ నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.పేరు కోసం చేసిన పని ప్రయోజనాన్నే నాశనం చేసిందంటూ శర్మ వాపోతున్నారు. స్థానికులు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా పోటీ చేసి ఓడిపోతుంటారని,ఇప్పుడు ఎన్నికలు జరగకుండానే ఓడిపోయారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
రాహుల్ అఫిడవిట్‌పై అనుమానాలు
అమేథీ/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ పేర్కొంది. వీటిపై ఆయన వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ధ్రువ్‌లాల్ లాయర్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్ పత్రాలను లాయర్ మీడియాకు చూపారు. రాహుల్ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. ఈ అనుమానాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ లాయర్ సోమవారం వరకు గడువు కోరారని అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ తెలిపారు. -
స్వతంత్రుల ప్రభావం ఎంత...
సాక్షి, మహబూబాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావటంతో ఇప్పుడు అందరికీ స్వతంత్ర అభ్యర్థుల గండం పట్టుకుంది. స్వతంత్రులకు పడే ఓట్లు ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపుతాయోనని జంకుతున్నారు. దీనిపై ప్రధాన పార్టీల నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మానుకోట నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా, డోర్నకల్ నియోజకవర్గంలో ద్విముఖ పోటీ నెలకొంది. అయితే గత ఎన్నికల్లో 10మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో 12 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఈ సారి స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈవీఎంలో నోటాతో పాటు 16మంది అభ్యర్థులు దాటితే కొత్తగా మరో ఈవీఎం అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాల్లో లేకపోయినప్పటికీ వీరికి పోలయ్యే ఓట్లు ఎవరికి నష్టం చేకూరూస్తాయోనన్న భయం అభ్యర్థులకు పట్టుకుంది. వీరి ప్రభావం ఎంత... మానుకోట నియోజకవర్గంలో జరిగిన 2014 ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు పోటీచేయగా, అందులో 7గురు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో 10 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతైనాయి. కానీ వీరు పోలైన ఓట్లలో సుమారు 3 శాతం ఓట్లను సాధించారు. డోర్నకల్ నియోజకవర్గంలో మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా వీరికి సుమారు 4శాతం ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థులకు ఓడిన అభ్యర్థులకు మధ్య తేడా కూడా అన్నే ఓట్ల శాతం ఉండటంతో వీరి పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుర్తులతో ఇబ్బందే.. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు, ప్రధాన పార్టీ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను పోలి ఉన్న సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. వృద్ధులకు సరిగా గుర్తులు కనిపించక ఓట్లు క్రాసింగ్ పడే ప్రమాదం ఉందని ప్రధాన పార్టీల అభ్యర్థులు జంకుతున్నారు. మరో వైపు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారు ఏ ప్రాంతాల్లో, ఏ సామాజిక వర్గాల ఓట్లును కొల్లగొట్టనున్నారోనని అన్ని పార్టీలు లెక్కలు కడుతున్నాయి. ఫలానా అభ్యర్థి ఫలానా ప్రాంతంకు చెందిన వాడు. దీంతో ఎదుటి పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందనే భావనలో ప్రస్తుతం అన్ని పార్టీల నాయకులు ఆలోచిస్తున్నారు. -
చీల్చు వీరులు!
తెర్లాం రూరల్, న్యూస్‌లైన్:ఎన్నికల్లో కొందరు గెలవకపోయినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లు చీల్చుతారు. అలాంటి వారి వల్ల గెలుపు ఖా యమన్న చోట కూడా ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. తెర్లాం మండలంలో ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు చోట్ల ఇండిపెండెం ట్లు పోటీ చేశారు. వీరంతా ప్రధాన పా ర్టీల అభ్యర్థులకు గట్టి పోటీనే ఇచ్చారు. కుసుమూరు, నందబలగ, కూనాయవలస, లోచర్ల స్థానాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. కుసుమూరు ప్రాదేశికంలో 2099 ఓట్లు పోలయ్యాయి. ఇక్క డ ఇండిపెండెండ్ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన గుంప శంకరరావు భార్య పెద్దింటి పార్వతి పోటీ చేశారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ నుంచి తెర్లాం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తెంటు సత్యంనాయుడు భార్య తెంటు నారాయణమ్మ, టీడీపీ తరఫున ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సిరికి గౌరీశ్వరి బరిలో నిలిచారు. అయితే ఇండిపెండెం ట్ అభ్యర్థికి కూడా గ్రామంతో పాటు, లిం గాపురంలో కొంతమేరకు పట్టు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాదేశికంలో వైఎస్సార్ సీపీకి మంచి పట్టు ఉండడంతో పాటు పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నందబలగ స్థానంలో వైఎస్సార్ సీపీ నుంచి వంజల ఆనందరావు, టీడీపీ నుంచి గుణుపూరు సీతాలక్ష్మి, ఇండిపెం డెంట్ అభ్యర్థిగా గుణుపూరు శివున్నాయుడు పోటీ చేశా రు. టీడీపీ తరఫున టిక్కెట్ ఆశించిన శివున్నాయుడు చివరి నిమిషంలో తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీకి విజయావకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆ పార్టీ నుంచి అధిక సంఖ్యలో ఓట్లు పోలయ్యే అవకాశం ఉం డడంతో ఆ పార్టీ అభ్య ర్థి మెజార్టీకి గండిపడవచ్చని పరిశీలకులు అంటున్నారు. కూనాయవలసలో వైఎస్సార్ సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. అయితే గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న కర్రి సత్యనారాయణ ఓట మి పాలైయ్యారు. ఈ ఎన్నికల్లో కర్రి మోహినిని ఇండిపెం డెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. వైఎ స్సార్ సీపీ అభ్యర్థి బొమ్మి కన్నంనాయు డు, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ జరిగింది. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థి కర్రి సత్యనారాయణ కలిసి పని చేశారు. అయినా వైఎస్సార్ సీపీ మద్దతుదారు బొమ్మి శ్రీనివాసరావు చేతిలో ఓట మి పాలయ్యూరు. ప్రస్తుతం టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు వేర్వేరుగా పోటీలో ఉండడంతో ఆ రెండు పార్టీల ఓట్లు చీల్చుకొనే అవకాశం ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికే ఎక్కువగా విజయూవకాశాలు ఉన్నారుు. ఇక లోచర్లలో వైఎస్సార్ సీపీ తరఫున రెడ్డి గౌరీశ్వరి, టీడీపీ నుంచి గొట్టాపు పార్వతి, ఇండిపెండెంట్‌గా మర్రాపు రవణమ్మ పోటీచేశారు. ఇక్కడ 2, 210 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో నిలిపిన మర్రాపు చిన్నంనాయుడు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి చెందిన రెడ్డి గౌరీ శంకరరావు భార్య గౌరీశ్వరి ఎంపీటీసీ అ భ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, పంచాయతీ ఎన్నికల్లో శంకరరావు ఓటమి చెందడంతో ఈ సానుభూతి రెడ్డి గౌరీశ్వరి విజయానికి దోహదపడతాయని పరి శీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఈసారి జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు ఏ పార్టీ అభ్యర్థుల కొంప ముంచనుందోనని మండల ప్రజలు చర్చించుకుం టున్నారు.