ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు.. విషమం | bihar Independent candidate Ravindra shot | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు కలకలం

Published Fri, Nov 6 2020 10:32 AM | Last Updated on Fri, Nov 6 2020 10:35 AM

bihar Independent candidate Ravindra shot - Sakshi

పట్నా : మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిహార్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హయ్‌గ్ఘ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రవీంద్రనాథ్‌ అలియాస్‌ చింటూ సింగ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున దర్భంగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తుపాకీ తుటాలకు గురైన అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దర్భాంగా మెడికల్‌ కాలేజీల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. ఘటనపై దర్యాప్తుగా ప్రత్యేక​ బృందాన్ని రంగంలోకి దింపాయని.. విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. (మోదీలా ట్రంప్‌ చేయలేకపోయారు)

గతంలో జేడీయూలో కొనసాగిన రవీంద్ర ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన ప్రత్యర్థులు ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా బిహార్‌లో​శనివారం మూడో దశ పోలింగ్‌ జరుగనుంది. దీంతో నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement