చీల్చు వీరులు!
Published Wed, Apr 9 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
తెర్లాం రూరల్, న్యూస్‌లైన్:ఎన్నికల్లో కొందరు గెలవకపోయినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లు చీల్చుతారు. అలాంటి వారి వల్ల గెలుపు ఖా యమన్న చోట కూడా ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. తెర్లాం మండలంలో ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు చోట్ల ఇండిపెండెం ట్లు పోటీ చేశారు. వీరంతా ప్రధాన పా ర్టీల అభ్యర్థులకు గట్టి పోటీనే ఇచ్చారు. కుసుమూరు, నందబలగ, కూనాయవలస, లోచర్ల స్థానాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. కుసుమూరు ప్రాదేశికంలో 2099 ఓట్లు పోలయ్యాయి. ఇక్క డ ఇండిపెండెండ్ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన గుంప శంకరరావు భార్య పెద్దింటి పార్వతి పోటీ చేశారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ నుంచి తెర్లాం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తెంటు సత్యంనాయుడు భార్య తెంటు నారాయణమ్మ, టీడీపీ తరఫున ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సిరికి గౌరీశ్వరి బరిలో నిలిచారు. అయితే ఇండిపెండెం ట్ అభ్యర్థికి కూడా గ్రామంతో పాటు, లిం గాపురంలో కొంతమేరకు పట్టు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లు చీల్చే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రాదేశికంలో వైఎస్సార్ సీపీకి మంచి పట్టు ఉండడంతో పాటు పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నందబలగ స్థానంలో వైఎస్సార్ సీపీ నుంచి వంజల ఆనందరావు, టీడీపీ నుంచి గుణుపూరు సీతాలక్ష్మి, ఇండిపెం డెంట్ అభ్యర్థిగా గుణుపూరు శివున్నాయుడు పోటీ చేశా రు. టీడీపీ తరఫున టిక్కెట్ ఆశించిన శివున్నాయుడు చివరి నిమిషంలో తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీకి విజయావకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆ పార్టీ నుంచి అధిక సంఖ్యలో ఓట్లు పోలయ్యే అవకాశం ఉం డడంతో ఆ పార్టీ అభ్య ర్థి మెజార్టీకి గండిపడవచ్చని పరిశీలకులు అంటున్నారు.
కూనాయవలసలో వైఎస్సార్ సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. అయితే గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న కర్రి సత్యనారాయణ ఓట మి పాలైయ్యారు. ఈ ఎన్నికల్లో కర్రి మోహినిని ఇండిపెం డెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. వైఎ స్సార్ సీపీ అభ్యర్థి బొమ్మి కన్నంనాయు డు, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ జరిగింది. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థి కర్రి సత్యనారాయణ కలిసి పని చేశారు. అయినా వైఎస్సార్ సీపీ మద్దతుదారు బొమ్మి శ్రీనివాసరావు చేతిలో ఓట మి పాలయ్యూరు. ప్రస్తుతం టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు వేర్వేరుగా పోటీలో ఉండడంతో ఆ రెండు పార్టీల ఓట్లు చీల్చుకొనే అవకాశం ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికే ఎక్కువగా విజయూవకాశాలు ఉన్నారుు.
ఇక లోచర్లలో వైఎస్సార్ సీపీ తరఫున రెడ్డి గౌరీశ్వరి, టీడీపీ నుంచి గొట్టాపు పార్వతి, ఇండిపెండెంట్‌గా మర్రాపు రవణమ్మ పోటీచేశారు. ఇక్కడ 2, 210 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో నిలిపిన మర్రాపు చిన్నంనాయుడు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి చెందిన రెడ్డి గౌరీ శంకరరావు భార్య గౌరీశ్వరి ఎంపీటీసీ అ భ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, పంచాయతీ ఎన్నికల్లో శంకరరావు ఓటమి చెందడంతో ఈ సానుభూతి రెడ్డి గౌరీశ్వరి విజయానికి దోహదపడతాయని పరి శీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఈసారి జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు ఏ పార్టీ అభ్యర్థుల కొంప ముంచనుందోనని మండల ప్రజలు చర్చించుకుం టున్నారు.
Advertisement