ఎన్నికల సిబ్బంది...భోజన ఇబ్బంది
జనగామ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బంది ఆకలితో అలమటించారు. జనగామ, మహబూబాబాద్‌లో ఓ దశలో ఆందోళనకు దిగేందుకు సిద్ధమయ్యూరు. జనగామ డివిజన్ పరిధిలోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘణపురం, దేవరుప్పుల, రఘునాథపల్లి మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును శామీర్‌పేట గ్రామంలోని ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టారు. ఈ మేరకు వెరుు్య మందికి పైగా ఉద్యోగులు, సిబ్బందికి విధులు కేటారుుంచారు. వీరికి తగిన భోజన ఏర్పాట్లు చేసే బాధ్యతను ఎన్నికల అధికారులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు.
సదరు వ్యక్తి అరకొరగా వంటలు వండడంతో ఉద్యోగులకు అందలేదు. దీంతో వారు కాంట్రాక్టర్‌తోపాటు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం పెట్టే వరకు కౌంటింగ్‌కు వెళ్లేదిలేదంటూ ఆందోళనకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ వెంకట్‌రెడ్డి అక్కడకు చేరుకోగా, ఉద్యోగులు ఆయనతో వాదనకు దిగారు. బీపీ, షుగర్ ఉందని, తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీడీఓను మందలించిన ఆర్డీఓ
‘భోజనాల ఏర్పాట్లలో ఎందుకింత నిర్లక్ష్యం చేశావు.. నీ వల్ల వీళ్లకు ఏం సమాధానం చెప్పుకోవాలి...’ అని జనగామ ఎంపీడీఓ జలేందర్‌రెడ్డిని ఆర్డీఓ వెంకట్‌రెడ్డి మందలించారు. మంది ఎక్కువగా ఉన్నారని... అందుకే భోజనం సరిపోలేదని ఆయన సమాధానం ఇచ్చారు. మంది ఎక్కువగా అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని వాదనకు సైతం దిగారు. ఇలాంటి కారణాలు తనకు చెప్పొద్దని, ఉద్యోగులకు తక్షణమే భోజన ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ హుకుం జారీ చేశారు. దీంతో అప్పటికప్పుడు అరకొరగా వంటలు చేయగా.. భోజనం చేసేందుకు ఉద్యోగులు, సిబ్బంది ఎగబడ్డారు. కొందరు పండ్లు, బిస్కట్లతో సరిపుచ్చుకున్నారు. కాగా, ఎన్నికల విధుల్లో పాల్గొన్నవారికి తాగునీటిని అందించడంలోనూ అధికారులు విఫలమయ్యూరు.