భోజనం పెట్టకపోవడంతో కౌంటింగ్ సిబ్బంది ఆందోళన
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: సకాలంలో భోజన సదుపాయం కల్పించకపోవడంతో ఎన్నికల లెక్కింపు సిబ్బంది ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం రఘునాధపాలెం మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మూడు గంటల వరకు భోజన సదుపాయం కల్పించకపోవడంతో లెక్కింపు ఆపి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో ఆందోళనకు దిగారు. దీంతో రిటర్నింగ్ అధికారి వారికి సర్ధిచెప్పారు. గంటలో భోజనం ఏర్పాటు చేస్తానని, అప్పటి వరకు స్నాక్స్ తీసుకుని కౌటింగ్ కొనసాగించాలని సూచించారు. దీంతో సిబ్బంది కౌంటింగ్ కొనసాగించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో భోజనం తెప్పించి సిబ్బందికి పెట్టారు. ఉదయం కూడా 8 గంటలకే కేంద్రంలో ఉండాలని చెప్పి కనీసం టీఫిన్, తాగు తదితర సౌకర్యాల కల్పన లో విఫలమయ్యారని సిబ్బంది ఎన్నికల అధికారుల ఏర్పాట్లు తీరుపై మండిపడ్డారు.