నర్మదా నదిలో పడవ మునక : ఆరుగురి మృతి | Six Drowned In Narmada River In Maharashtra | Sakshi
Sakshi News home page

నర్మదా నదిలో పడవ మునక : ఆరుగురి మృతి

Published Tue, Jan 15 2019 6:09 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

Six Drowned In Narmada River In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని నందర్బార్‌ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం నుంచి 36 మందిని కాపాడి స్ధానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా నదీమతల్లికి పూజలు చేసేందుకు మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్‌గావ్‌ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులని చెప్పారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement