సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కొత్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఓ పర్వతారోహకుడు. ఆదిలాబాద్ ఎస్పీగా పని చేస్తున్న సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఇప్పటి వరకు 6 పర్వతాలను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్నారు డాక్టర్. తరుణ్ జోషి బుధవారం రాచకొండ సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
♦పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పాటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సరీ్వసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు.
♦ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉద్యోగంలో తర్వాతే పదేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీస్ మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్‌ఎల్‌బీలో చేరి 2019 జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... వర్సిటీ టాపర్‌గా నిలిచారు.
♦ తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరక ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ పోలీసు విభాగంలో ఉన్న ఎస్పీ జి.రాధిక అప్పట్లో అదే జిల్లాలో అదనపు ఎస్పీగా పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఆమె పలు పర్వతాలను అధిరోహించారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు.
♦ ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడు కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుఢ్యానికి ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు.
♦ ఆదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లు పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచి్చన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు.
♦ 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఆరింటిపై తన కాలు మోపారు. ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
తరుణ్ జోషి అధిరోహించిన పర్వతాలు...
► 2018 మేలో సదరన్ రష్యాలోని భారీ అగి్నపర్వతమైన మౌంట్ ఎల్బ్రస్‌ను ఎక్కారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది.
► 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది.
► అదే ఏడాది ఆగస్టులో ఇండోనేయాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ అధిరోహించారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు.
► 2020 జనవరి 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4,897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది.
► విన్సన్ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2,280 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
► 2021 జనవరి 21న టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఇది సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment