నిజాంసాగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల నిర్వహణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. ప్రదాన రహదారులతో పాటు చెక్‌పోస్టు ల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద వాహనాల తనిఖీని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు.
చెక్‌పోస్టుల్లో వా హనాలను తనిఖీ చేస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారుల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అ చ్చంపేట అథితి గృహం వద్ద స్థానిక అధికారులతో వారు మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా నగదు, మ ద్యం రవాణా కాకుండా పకడ్బందీగా సోదాలు చేయాలన్నారు. వాహనాల తనిఖీల పై కొందరు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆర్టీసీ తో పాటు ప్రై వేటు వాహనాలను అణువణువు తనిఖీ చేయాలన్నారు. అభ్యర్థులు ప్రచారం కోసం వాడుకుం టున్న వాహనాల అనుమతులను పరిశీలించాలన్నా రు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న పార్టీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేయా లన్నారు.
వందశాతం పోలింగ్ నమోదుకావాలి
ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియో గించుకొని వందశాతం పోలింగ్ నమోదు చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న గిరిజన ఓటర్లకు సూచించారు. పిప్పిరేగడి తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మీ అవసరాల కోసం తండాలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లంద రూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
Published Fri, Apr 18 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement