నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి శుక్రవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, తెలంగాణ యూనివర్సీటీ విద్యార్థులు దాదాపు 2,268 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తమ విధులను అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో నిర్వహించినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారు విధుల్లో పాల్గొన్నారన్నారు.
ప్రత్యేకంగా ఓటర్లను ‘క్యూ’ పద్ధతి పాటించే విధంగా చూసి, ఓటర్ల సందేహాలను నివృత్తిచేసి, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కృషి చేశారన్నారు. దీంతోపాటు పోలింగ్ స్టేషన్‌లో సంబంధిత పోలీసు సిబ్బందికి సహాయ సహకారాలు అందించడంద్వారా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా రిజర్వు ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.మల్లికార్జున్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జి.దేవిదాసు, బి.ప్రమోద్‌కుమార్, ఎన్.ఆరున్‌రెడ్డి ,వి.నర్సారెడ్డి, జి. హన్మాండ్లు, ఎం.సురేష్‌కుమార్, వై.నారాయణ, కే.రవీందర్‌రావు, డి.వీరారెడ్డి, డాక్టర్లు ఐ.గంగాధర్, కే.రవీందర్‌రెడ్డి, విద్యార్థులు ఉన్నారు.
వలంటీర్లకు ప్రశంస పత్రాలు
Published Sat, May 24 2014 3:00 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement