ఆగిన ఎస్‌ఐల బదిలీలు | SI transfers stopped | Sakshi
Sakshi News home page

ఆగిన ఎస్‌ఐల బదిలీలు

Published Thu, Aug 14 2014 3:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

SI  transfers stopped

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల వివాదం ముఖ్యమంత్రి పేషీకి చేరింది. దీంతో బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొంత కాలంగా ఎస్‌పీ తరుణ్‌జోషి, డీఐజీ సూర్య నారాయణ మధ్యన అంతరం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల విషయమై కొంత వివాదం ఏర్పడింది.

అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేసిన సిఫారసుల విషయమై ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన సమన్వయం కుదరని కారణంగా, మంగళవారం రాత్రి వెలువడిన 43 మంది ఎస్‌ఐల బదిలీ ఉత్తర్వులు తాజా వివాదానికి తెరలేపాయి. ఎస్‌పీ తమను పట్టించుకోకుండా, ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పో స్టింగులు ఇచ్చారంటూ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయిని న ర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మొదటి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని వివరించారు. స్పందించిన సీఎం ఎస్‌ఐల బదిలీ ఉత్తర్వులు నిలిపివేయాలని హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించడం చర్చనీయాంశం అయ్యింది.

 ఎస్‌పీని మార్చాలని
 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, అప్పటి కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్‌పీ డాక్టర్ తరుణ్‌జోషి తమ పట్ల పక్షపా త ధోరణితో వ్యవహరించారన్న భావన మొదటినుంచీ పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఉంది. ఓట్ల లెక్కిం పు సందర్భంగా డిచ్‌పల్లిలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భా స్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ పీ తీరుపై పోచారం సహా పలువురు నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బా ధ్యతలు చేపట్టిన తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్‌పీ తరుణ్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టా రు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్నను మాత్రమే బదిలీ చేసిన ప్రభుత్వం ఎస్‌పీ జోలికి వెళ్లలేదు. పోలీసు అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ పలువురు అధికార పార్టీ నేతలు ఇటీవల కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఎస్‌ఐల బదిలీల జాబితా కొత్త వివాదానికి తెర లేపింది. రెండు, మూడు నెలలుగా ఎస్‌ఐల బదిలీలు జరుగు తాయన్న ప్రచారం జరిగింది. పది రోజులుగా డీఐజీ, ఎస్‌పీ బదిలీలకు కసరత్తు చేస్తున్నా సమన్వయం కుదరక కొలిక్కి రాలేదని తెలిసింది.

కొందరు అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరు దారిలో వెళ్లడం వివాదానికి కారణంగా చెప్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు ఒకరు, అంకితభావంతో పనిచేసే ఎస్‌ఐలకు ఇంకొకరు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేయడంతో వివాదంగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఎస్‌పీని బదిలీ చేయాలని పట్టుబట్టడంతో ఎస్‌ఐల బదిలీ ఉత్తర్వులు తాత్కాలికంగా రద్దు చేశారు.

 43 మంది ఎస్‌ఐల బదిలీ సారాంశం ఇదీ
 కోటగిరి, నిజామాబాద్-2టౌన్, నిజాంసాగర్, మద్నూరు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, నవీపేట, వర్ని ఎస్‌ఐలు మినహా మిగతావారు బదిలీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఆరుగురు ఎస్‌ఐలు కొత్తగా జిల్లాకు రాగా, జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురిని హైదరాబాద్‌కు పంపారు. డీడీ హైదరాబాద్‌లో ఎస్‌ఐగా ఉన్న వేణుగోపాల్‌కు డిచ్‌పల్లి, టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న రాజశేఖర్, శ్రీనివాస్‌కు నందిపేట, కమ్మర్‌పల్లి పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్, చిక్కడపల్లిల్లో ఎస్‌ఐలుగా ఉన్న విజయ్‌కుమార్, వీరబాబు, రాంప్రసాద్‌లను దేవునిపల్లి, భిక్కనూర్, ఎడవల్లి ఎస్‌ఐలుగా నియమించారు.

నిజామాబాద్ వీఆర్‌లో ఉన్న జాన్‌రెడ్డి, డిచ్‌పల్లి, బాన్సువాడ, ధర్పల్లి, బోధన్, నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్‌ఐలు చంద్రశేఖర్, కృష్ణ, అంజయ్య, రవి, సురేష్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడివారిని హైదరాబాద్‌కు బదిలీ చేయడం. అక్కడి నుంచి వచ్చిన వారిని వీరి స్థానాలలో నియమిస్తున్న విషయంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు కనీస సమాచా రం లేదనే వాదన ఉంది.

కొందరు ఎమ్మెల్యేలు తమ కోసం పని చేసిన కేడర్, వారి బంధువులు, పరిపాలన సౌలభ్యం కోసం చేసిన సిఫారసులకు ఈ బదిలీలలో ప్రాధాన్యం దక్కలేదని అంటున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి పోచారంతోపాటు శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, హన్మంత్ సింధే, బిగాల గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, అహ్మద్ షకీల్ తదితరులు సీఎం, హోంమంత్రిని కలిసినట్లు తెలిసింది. రెండు మూడు రోజులలో ఎస్‌ఐల బదిలీలపై తాజా ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement