Surya Narayana
-
అనపర్తి: ‘రామకృష్ణారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరిస్తా’
సాక్షి,అనపర్తి: కాకినాడలోని అనపర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం సాగుతోంది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి పరుడంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచాడు. దీంతో ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్దమయ్యారు. ఇవాళ (శుక్రవారం) ముహూర్తం ఖరారు చేసుకున్న చేసుకునన్నారు. దీంతో అనపరర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్చలకు వేదికను సిద్ధం చేశారు. అయితే అక్కడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి బయల్దేరగా.. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్లమిల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనపర్తిలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తనకు చేసిన సవాలును ఎదుర్కోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిద్ధమైయ్యారు. రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ పెట్టి మరీ ప్రజలకు వివరిస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వలేదు. ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. -
సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. పోలీసుల తరపున దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్‌రెడ్డి వివరించారు. ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు. ఆ కాల్‌డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్‌ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
ఎమ్మెల్సీగా కుడుపూడి ప్రమాణ స్వీకారం
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అమరావతిలో సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, బీసీ నేతలు సోమవారం తరలివెళ్లారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శ్రీజై సూరిశ్రీ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్పర్సన్ కుడుపూడి సత్యశైలజ, అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ అమలాపురం అధ్యక్షుడు సంసాని బులినాని, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్, అయినవిల్లి జెడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లాల బీసీ సంఘాల నేతలు కోడి దుర్గాప్రసాద్, కుక్కుల శ్రీనివాసరావు, వాసంశెట్టి తాతాజీ, కుడుపూడి త్రినాథ్, కాండ్రేగుల గోపి తదితరులు అమరావతి వెళ్లారు. నేడు 40 కిలోమీటర్ల మేర ఊరేగింపు ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కుడుపూడి సూర్యనారాయణరావు తొలిసారిగా మంగళవారం మధ్యాహ్నం జిల్లాకు రానున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాసం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు మొదలవుతుందన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి ఊరేగింపు వాహనంపై మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశీనులవుతారని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొని ఈ ఊరేగింపును విజయవంతం చేయాలని బులినాని విజ్ఞప్తి చేశారు. -
భాద పోయింది.. చాలు సర్
-
కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం అవాస్తవం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తోన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు రామసూర్యనారయణ తెలిపారు. ఈ విషయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు గ్రామ సచివాలయంలో పరిపాలన సౌలభ్యం కోసమే. ఈ పోస్టులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఈ పరీక్షల్లో 10 శాతం వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. ఒకవేళ వారు పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోయినా వారిని ఉద్యోగాల్లో నుంచి తీసివేయరు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం జరగదు. అర్హత కలిగిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో జరిగిన తప్పిదం వల్లే ఈ గందరగోళం నెలకొంది. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానాన్ని రద్దు చేయాలని అడిగాం. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారని’ వెల్లడించారు. -
ఏపీజీఈఏ అధ్యక్షుడిగా రామ సూర్యనారాయణ
సాక్షి, కాకినాడ : ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యకుడిగా రామ సూర్యనారాయణను, కార్యదర్శిగా ఆస్కరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుములల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని 13 జిల్లాలకు నూతన అధ్యక్ష, కార్యదర్శిల పేర్లను సంఘం అధ్యక్షుడు రామసూర్యనారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వ హయంలో సీఎం వద్ద భజన చేసిన కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ నూతన ముఖ్యమంత్రి వద్దకు చేరారని రామసూర్యనారాయణ అన్నారు. -
వీడిన నవ వరుడి హత్యకేసు మిస్టరీ
-
హత్య పథకం నవ వధువుదే
తూర్పుగోదావరి, కరప (కాకినాడరూరల్): వైవాహిక జీవితం ఆనందంగా గడపాల్సిన ఆ యువజంటలో నవ వరుడు మరణించగా నవ వధువు జైలుపాలైంది. నవ వధువు తన ప్రియుడితో కలసి హత్యకు పథకరచన చేసి ఈ హత్య చేయించినట్టు తేలింది. కరప మండలం పెనుగుదురువద్ద ఈనెల 22వ తేదీన ఒకయువకుడు (నవవరుడు) దారుణహత్యలోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహమైన వారం రోజుల్లోనే నవవరుడు హత్యకు గురికావడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో కరప ఎస్సై జి.అప్పలరాజు, పోలీసుసిబ్బంది వారంరోజుల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్టు చేసి కాకినాడ కోర్టులో హాజరుపరచగా రెండువారాలు రిమాండ్ విధించారు. కరప పోలీసుస్టేషన్లో గురువారం కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం కరప గ్రామంలోని నీలయ్యతోటవీధికి చెందిన పేకేటి రాముడు కుమారుడు సూర్యనారాయణ (27) కరపమండలం పెనుగుదురు–పాతర్లగడ్డ రోడ్డులో పంటపొలాల్లో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై నరకడంతో అతను మృతి చెందాడు. మృతుని సోదరుడు సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదేరోజు హత్యకేసుగా నమోదుచేశారు. మృతుడు పేకేటి సూర్యనారాయణకు కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మితో ఈనెల 15వ తేదీన వివాహమైంది. నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా అక్రమసంబంధం ఉంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టంలేక నాగలక్ష్మి తన ప్రియుడు రాధాకృష్ణతో కలసి హత్యకు పథక రచన చేసింది. అందులో భాగంగా ముద్దాయి రాధాకృష్ణ ఈనెల 21వ తేదీన సూర్యనారాయణకు ఫోన్ చేసి, సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడనుంచి పక్కనే గల పాతర్లగడ్డరూటులోగల పంటపొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ కూర్చుండపెట్టి తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నేరస్తుడు పట్టుబడింది ఇలా: స్థానికుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నవవరుడు సూర్యనారాయణ భార్యతో బయటకు వెళ్లివస్తానని చెప్పి వచ్చాడు. మృతుని భార్య నాగలక్ష్మి, ఆమెప్రియుడు రాధాకృష్ణ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం రాధాకృష్ణ పెనుగుదురు వద్ద నుంచి ఫోన్ చేసి సూర్యనారాయణను రప్పించాడు. కత్తితో నరికి చంపేసి, మృతదేహంపై గడ్డికప్పి, కత్తిని కేఎంజే కాలువలో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి సోదరులు, బంధువులు ఆ రాత్రి ఎంతగా గాలించినా సూర్యనారాయణ జాడ తెలియలేదు. దాంతో వారు పోలీసుస్టేషన్లో సూర్యనారాయణ అదృశ్యంపై ఫిర్యాదుచేశారు. రాధాకృష్ణ పేపకాయలపాలెంలోని నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెళ్లికొడుకు మోటార్‌సైకిల్ పెనుగుదురు సమీపంలోని పొలాల్లో కనిపించిందని చెప్పాడు. నాగలక్ష్మి, సూర్యనారాయణ బంధువులతోపాటు వెదకటానికి రాధాకృష్ణ కూడా ఏమీతెలియనట్టు వెళ్లాడు. మోటార్‌సైకిల్‌వద్దకు అందరితోపాటు వెళ్లి కొంతసేపటికి దూరంగా మృతుడి చెయ్యి కనిపిస్తోంది అదిగో అంటూ చూపించడంతో అందరూ అక్కడకు వెళ్లారు. అక్కడ సూర్యనారాయణ మృదేహం కనిపించింది. మృతుని బంధువులు మృతదేహం కనిపించినట్టు కరప ఎస్సై జి.అప్పలరాజుకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చినా ఆధారాలు దొరకలేదు. కాకినాడరూరల్ సీఐ ఈశ్వరుడు, పోలీసుసిబ్బంది తమదైన శైలిలో మృతదేహం ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ క్లూ లాగడంతో ఒకటొకటిగా వాస్తవాలు వెలుగుచూశాయి. -
ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో బుధవారం సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వెల్లడించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఉద్యోగులు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ప్రసారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పునర్నిర్మాణానికి పని గంటలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై రాధాకృష్ణ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానూ, అవమానకరంగానూ ఉన్నాయన్నారు. అనంతరం శ్రీలంకలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. -
కాస్ట్లీ గురూ...
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె వార్తల్లో నిలవడం కామనే కదా? ఇందులో ప్రత్యేకత ఏంటి? అనుకునేరు. ఇప్పుడు నిలవడం ఓ ప్రత్యేకతే మరి. తన యోగా గురువు సూర్యనారాయణ సింగ్‌కు రెండు కోట్ల విలువైన ఫ్లాట్ గురుదక్షిణగా ఇచ్చి, బాలీవుడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఈ బ్యూటీ. 18 ఏళ్ల కిందట జుహూ బీచ్‌లో జిమ్నాస్టిక్స్ నేర్పుతున్న సూర్యనారాయణ.. కంగనాను ఆకట్టుకున్నారు. అప్పటికి ఈ అమ్మడు బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టలేదు. అప్పడే ఆయన్ను తన యోగా గురువుగా స్వీకరించి, నాటి నుంచి నేటి వరకూ యోగా శిక్షణ తీసుకుంటున్నారు. తన నుంచి ఏమీ ఆశించకుండా, తనకోసం ఇంత చేస్తున్న గురువుకు దక్షిణగా ఏదైనా ఇవ్వాలని ఫిక్స్ అయిన ఈ భామ యోగా కేంద్ర నిర్వహణకు వీలుగా ఉండేందుకు రెండు కోట్లు విలువ చేసే రెండు పడక గదుల ఇల్లు బహుమానంగా ఇచ్చారట. అది కూడా సెలబ్రిటీలు, ధనవంతులు ఉండే ముబై లోని అంధేరీ ప్రాంతంలో. యోగా శిక్షణకు అనువుగా ఉండేలా విశాలమైన బాల్కనీతో పాటు సకల సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ రెడీ చేయించారట కంగనా. ఏదేమైనా కంగనా గురుభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. -
కొడుకు ప్రేమవివాహం చేసుకుంటాననడంతో...
హిందూపురం రూరల్ : చేతికొచ్చిన కుమారుడు తన మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఓ తండ్రి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెద్ద గుడ్డంపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. రూరల్ హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ తెలిపిన వివరాల మేరకు.. పెద్దగుడ్డంపల్లికి చెందిన సూర్యనారాయణ (58) చిన్న కుమారుడు శివకృష్ణ బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంటానని శివకృష్ణ తన తండ్రితో చెప్పడంతో ఆయన మందలించాడు. దీనికి కుమారుడు ససేమిరా అనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ మంగళవారం ఉదయం రేషం షెడ్డులోకి వెళ్లి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సూర్యనారాయణను భార్య రామాంజినమ్మ హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా హాలియాలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి చెందాడు. హాలియా మండలం కొత్తపల్లెకు చెందిన లక్ష్మయ్య (60) కాలిలో మేకు గుచ్చుకుని.... గాయం తీవ్రమైంది. దీంతో వైద్యం కోసం అతడు 15 రోజుల క్రితం హాలియాలోని ఆర్ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ వద్దకు వెళ్లాడు. నయం చేస్తానని చెప్పి రూ 25 వేలు తీసుకుని.. లక్ష్మయ్యను ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు లక్ష్మయ్యకు సూర్యనారాయణ ఇంజక్షన్ ఇచ్చాడు. 11.00 గంటలకే లక్ష్మయ్య మృతి చెందాడు. సూర్యనారాయణ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే లక్ష్మయ్య మృతి అతడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి ఆర్ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ పరారయ్యాడు. బంధువుల ఆందోళన శనివారం కూడా కొనసాగుతుంది. అయితే పట్టణానికి చెందిన పెద్దమనుషుల ద్వారా లక్ష్మయ్య బంధువులతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకు స్థానికంగా పెద్ద మనుషులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. -
ప్రాణం నిలుపని కిడ్నీ దానం
రెండు కిడ్నీలూ చెడిపోయిన భర్తను బతికించుకోవాలని ఎంతగానో ఆరాటపడి ంది. ఎలాగైనా భర్త ప్రాణాలు కాపాడాలని భావించి తన రెండు కిడ్నీలలో ఒక దానిని భర్తకు ఇచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. భర్త ప్రాణం దక్కలేదు. ఆమె దాతృత్వం ఫలించలేదు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. లావేరు: మండలంలో ని తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల సూర్యనారాయణ సన్నకారు రైతు. ఉదయం నుంచి పొద్దుపోయేవరకు పొలంపనుల్లో నిమగ్నమయ్యేవాడు. పంటలపై వచ్చిన ఆదాయంతో కుటుం బాన్ని పోషించేవాడు. ఆదర్శరైతుగా పనిచేస్తూ గ్రామస్తులకు పంటల సాగుపై విలువైన సూచనలు అందించేవాడు. అయితే, 2013వ సంవత్సరంలో తరచూ జ్వరం రావడంతో ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించా డు. అక్కడి వైద్యులు పలు వైద్యపరీక్షలు చేసిన అనంతరం రెండు కిడ్నీలు పాడైనట్టు గుర్తించారు. కిడ్నీ అమర్చితే తప్ప బతకడం కష్టమని చెప్పారు. ఎవరైనా కిడ్నీలు దానం చేసేందుకు ముందుకు వస్తే బతికించవచ్చన్నారు. దీంతో ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేని భార్య సుశీల తన కిడ్నీ భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు సుశీల కిడ్నీ భర్తకు పనికి వస్తుందని నిర్ధారించారు. 2014, ఫిబ్రవరి 14న ఆపరేషన్ చేసి సుశీల కిడ్నీని సూర్యనారాయణకు అమర్చారు. కిడ్నీ అమర్చిన తరువాత కొద్ది రోజులు వరకూ సూర్యనారాయణ ఆరోగ్యం బాగుంది. ఇక పర్వాలేదని, భర్త కోసం భార్య సుశీల చేసిన దాతృత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి సూర్యనారాయణ ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకపోయింది. చివరకు సోమవారం(ఈ నెల 23న) తనువు చాలించడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తను, పిల్లలు ఏ పాపం చేశారంటూ రోది స్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మృతునికి భార్యతో పాటు కుమారుడు నవీన్, కుమార్తె సుష్మితలు ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, దన్నాన రాజినాయుడు, దేశెట్టి తిరుపతిరావు, పిల్లా రాములు మంగళవారం సూర్యనారాయణ భార్య, పిల్లలను పరామర్శించారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
జీవన ఎరువుల వాడకం మేలు! ప్రస్తుత పరిస్థితుల్లో అధిక మోతాదులో రసాయనాలు వాడడం వల్ల సాగు ఖర్చు పెరగడమేకాకుండా వివిధ పర్యావరణ దుష్ఫలితాలు కూడా ఏర్పడుతున్నాయి. రసాయనాల ప్రభావాన్ని కొద్దిగానైనా నియంత్రించాలంటే జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. * బ్యాక్టీరియాని ఉపయోగించి శిలీంధ్రాలను నాశనం చేయడం ఒక పద్ధతి అయితే.. శిలీంధ్రాలను వాడడం ద్వారా శిలీంధ్రాలను అరికట్టడం ఈ జీవ నియంత్రణలో రెండో పద్ధతి. * సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, బిసిల్లస్ తురంజియన్సిస్ అనే బ్యాక్టీరియా వర్గానికి చెందిన సూక్ష్మజీవులు, ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రంను జీవ నియంత్రణ పద్ధతిలో అధికంగా ఉపయోగిస్తారు. * సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ భూమిలో నివసించే వివిధ పంటల్ని నాశనం చేసే వడలు తెగులు, కాండం కుళ్లు తెగులు, ప్యూజేరియం, మాక్రోఫోమినా, రైజోక్టోనియా, స్క్లీరోషియ, స్క్లీరోషియారంల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను, వంకాయ, బెండ, దోస వంటి కూరగాయల పంటలను సమర్థవంతంగా కాపాడుతుంది. * బాసిల్లస్ తురంజియన్సిస్ లేదా బి.టి. మందులు రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాలను ఆశించి, వాటిని రోగగ్రస్తం చేయటం ద్వారా ఉధృతిని తగ్గిస్తుంది. * కోడెర్మా విరిడి శిలీంధ్రం కంది, పత్తి, వేరుశనగ, శనగ పంటలకు సోకే ఎండుతెగుళ్లకు, పంటలను ఆశించే వేరుకుళ్లు తెగుళ్లకు, కూరగాయ తోటల్లో నారుకుళ్లు తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. * సూడోమోనాస్ లేదా ట్రైకోడర్మాని విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి 10గ్రా. కలిపి విత్తడానికి ముందు 12 గంటలు ఉంచి విత్తుకోవాలి. * 20 కిలోల సూడోమోనాస్ 50 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో మొక్క వేర్లు 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. * 5 కిలోల సూడోమోనాస్‌ను వర్మీకంపోస్టు/ వేరుశనగ/ వేపపిండితో కలిపి ఒక వారం ఉంచి మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. 5 గ్రా. సూడోమోనాస్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, పరిశోధన, విస్తరణ సంచాలకులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సంకరజాతి పశువుల్లో చూడి.. జాగ్రత్తలు! మంచి సంకరజాతి పశువులు ఈనిన 60-90 రోజుల్లో మళ్లీ చూడి కడుతుంది. 300 రోజుల వరకు పాలిస్తుంది. కానీ, ఈనిన 8-9 నెలల్లో క్రమంగా పాలు పితకడం మానేస్తేనే పశువు ఆరోగ్యం, తదుపరి ఈతలో పాలదిగుబడి, దూడ ఆరోగ్యం బాగుంటాయి. ఈనడానికి ముందు 2 నెలల్లో మేపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లి కడుపులో దూడ ఈ 2 నెలల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. తదుపరి ఈతకు కావాల్సిన పోషక నిల్వలను సమకూర్చుకునేదీ ఈ కాలంలోనే. చూడి పశువులకు మేపుదల తగినంత లేకపోతే పశువు నీరసంగా ఉంటే.. ఈనిన తర్వాత పాలదిగుబడి తక్కువగా ఉంటుంది. దూడ నీరసంగా ఉంటుంది. కొన్నిసందర్భాల్లో దూడ చనిపోతుంది. ఈనిన 2-3 నెలల్లోనే మళ్లీ చూడి కట్టించాలి. పాలు ఎండిపోయే వరకు పాలు తీయకూడదు. ఈనిన 8-9 నెలలకల్లా పాలు తీయడం క్రమంగా ఆపేయాలి. తద్వారా తదుపరి ఈతకు అవసరమైన పోషకాల నిల్వలను పశువు సమకూర్చుకోగలుగుతుంది. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా -
ఆగిన ఎస్ఐల బదిలీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీల వివాదం ముఖ్యమంత్రి పేషీకి చేరింది. దీంతో బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొంత కాలంగా ఎస్పీ తరుణ్‌జోషి, డీఐజీ సూర్య నారాయణ మధ్యన అంతరం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీల విషయమై కొంత వివాదం ఏర్పడింది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేసిన సిఫారసుల విషయమై ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన సమన్వయం కుదరని కారణంగా, మంగళవారం రాత్రి వెలువడిన 43 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు తాజా వివాదానికి తెరలేపాయి. ఎస్పీ తమను పట్టించుకోకుండా, ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పో స్టింగులు ఇచ్చారంటూ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయిని న ర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మొదటి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని వివరించారు. స్పందించిన సీఎం ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు నిలిపివేయాలని హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించడం చర్చనీయాంశం అయ్యింది. ఎస్పీని మార్చాలని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, అప్పటి కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి తమ పట్ల పక్షపా త ధోరణితో వ్యవహరించారన్న భావన మొదటినుంచీ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఉంది. ఓట్ల లెక్కిం పు సందర్భంగా డిచ్‌పల్లిలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భా స్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ పీ తీరుపై పోచారం సహా పలువురు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బా ధ్యతలు చేపట్టిన తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టా రు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్నను మాత్రమే బదిలీ చేసిన ప్రభుత్వం ఎస్పీ జోలికి వెళ్లలేదు. పోలీసు అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ పలువురు అధికార పార్టీ నేతలు ఇటీవల కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఎస్ఐల బదిలీల జాబితా కొత్త వివాదానికి తెర లేపింది. రెండు, మూడు నెలలుగా ఎస్ఐల బదిలీలు జరుగు తాయన్న ప్రచారం జరిగింది. పది రోజులుగా డీఐజీ, ఎస్పీ బదిలీలకు కసరత్తు చేస్తున్నా సమన్వయం కుదరక కొలిక్కి రాలేదని తెలిసింది. కొందరు అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఎస్ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరు దారిలో వెళ్లడం వివాదానికి కారణంగా చెప్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు ఒకరు, అంకితభావంతో పనిచేసే ఎస్ఐలకు ఇంకొకరు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేయడంతో వివాదంగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఎస్పీని బదిలీ చేయాలని పట్టుబట్టడంతో ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు తాత్కాలికంగా రద్దు చేశారు. 43 మంది ఎస్ఐల బదిలీ సారాంశం ఇదీ కోటగిరి, నిజామాబాద్-2టౌన్, నిజాంసాగర్, మద్నూరు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, నవీపేట, వర్ని ఎస్ఐలు మినహా మిగతావారు బదిలీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఆరుగురు ఎస్ఐలు కొత్తగా జిల్లాకు రాగా, జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురిని హైదరాబాద్‌కు పంపారు. డీడీ హైదరాబాద్‌లో ఎస్ఐగా ఉన్న వేణుగోపాల్‌కు డిచ్పల్లి, టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న రాజశేఖర్, శ్రీనివాస్‌కు నందిపేట, కమ్మర్పల్లి పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్, చిక్కడపల్లిల్లో ఎస్ఐలుగా ఉన్న విజయ్‌కుమార్, వీరబాబు, రాంప్రసాద్‌లను దేవునిపల్లి, భిక్కనూర్, ఎడవల్లి ఎస్ఐలుగా నియమించారు. నిజామాబాద్ వీఆర్‌లో ఉన్న జాన్‌రెడ్డి, డిచ్పల్లి, బాన్సువాడ, ధర్పల్లి, బోధన్, నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్ఐలు చంద్రశేఖర్, కృష్ణ, అంజయ్య, రవి, సురేష్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడివారిని హైదరాబాద్‌కు బదిలీ చేయడం. అక్కడి నుంచి వచ్చిన వారిని వీరి స్థానాలలో నియమిస్తున్న విషయంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు కనీస సమాచా రం లేదనే వాదన ఉంది. కొందరు ఎమ్మెల్యేలు తమ కోసం పని చేసిన కేడర్, వారి బంధువులు, పరిపాలన సౌలభ్యం కోసం చేసిన సిఫారసులకు ఈ బదిలీలలో ప్రాధాన్యం దక్కలేదని అంటున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి పోచారంతోపాటు శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, హన్మంత్ సింధే, బిగాల గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, అహ్మద్ షకీల్ తదితరులు సీఎం, హోంమంత్రిని కలిసినట్లు తెలిసింది. రెండు మూడు రోజులలో ఎస్ఐల బదిలీలపై తాజా ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. -
పశువుల పునరుత్పత్తిలో పోషణ ప్రాముఖ్యత
మన దేశంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా ఉత్పాదక శక్తి తక్కువ. జన్యుపరమైన, హార్మోను, వ్యాధి, పోషణ సంబంధమైన అంశాలే ఇందుకు కారణం. దూడలకు చిన్న వయసు నుంచే విటమిన్ ఏ, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మేత మేపాలి. అప్పుడు త్వరగా ఎదిగి, ఎదకు వస్తాయి. గర్భసంచి, ఓవరీస్ బాగా ఎదగ డానికి భాస్వరం తగినంత అందించాలి.చూడి పశువుకు పోషణ సరిగ్గా అందకపోతే.. తల్లి తన శరీర పోషక నిల్వల నుంచి, గర్భంలోని దూడ నుంచి కూడా పోషకాలను గ్రహిస్తుంది. రాగి లోపం ఉంటే పిండం మరణాలు సంభవిస్తాయి.విటమిన్ ఏ, ఈ అయోడిన్, మాంగనీసు లోపం వల్ల చూడి పశువులు ఈసుకుపోతాయి. పోషణ లోపం లేకుండా జనేంద్రియాలు బాగా అభివృద్ధి చెందితే ఈత సమస్యలు రావు. పోషణ మరీ ఎక్కువైతే పశువు వెనుక కొవ్వు పెరిగి ఈత ఇబ్బందులెదురవుతాయి. ఈనిన తర్వాత 4-6 వారాల్లో అధిక పాల ఉత్పత్తికి చేరుకుంటుంది. ఈ దశలో పోషకాలు సరిగ్గా ఇవ్వకపోతే పాల ఉత్పత్తి కోసం శరీర నిల్వలను వాడుకుంటుంది. దీని వల్ల ఎదకు రావడం కష్టమవడం, తిరగపొల్లడం వంటి సమస్యలొస్తాయి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా -
సరిహద్దుల్లో బందోబస్తు
కలెక్టరేట్/నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వద్ద ప్రత్యేక బందోబస్తు చేపట్టినట్లు డీఐజీ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కర్ణాటకలోని బీదర్ జిల్లా ఎస్పీ, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఎస్పీ, రాష్ట్రంలోని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పోలింగ్ రోజు పౌరులు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు, అరెస్టు వారెంట్ల విషయంలో ఇరు జిల్లాల పోలీసులు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని ఎస్పీలకు సూచించారు. ఇరు ప్రాంతాలలో సంఘ విద్రోహ శక్తుల విషయమై ముందస్తు సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆయుధాలు రానివ్వకుండా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. చెక్ పోస్టులలో సిబ్బందిని అవసరమైన మేరకు నియమించుకోవాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలలో పాత నేరస్థులపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ జిల్లాలోకి పొరుగు జిల్లాల నుంచి మద్యం, డబ్బు, మత్తుపదార్థాల తరలింపును అరికట్టేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఘటనలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న, మెదక్ ఎస్పీ డాక్టర్ శిమెషీ బాజ్‌పాయ్, ఆదిలాబాద్ ఎస్పీ డాక్టర్ గజారావ్ భూపాల్, నాందేడ్ ఎస్పీ పరమ్జీత్సింహ దహియా, బీదర్ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, బీదర్ అడిషనల్ ఎస్పీ సంగీత, ట్రెయినీ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్, జిల్లా అదనపు ఎస్పీ పాండునాయక్, ప్రదీప్‌రెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు అనిల్‌కుమార్, ఆకుల రామ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, తాజ్‌ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ పండుగ సంబరాలు వచ్చేశాయ్..
విజయవాడ, న్యూస్‌లైన్ : సాక్షి పండుగ సంబ రాలు రోజుకొకరిని లక్షాధికారిని చేయనున్నాయి. నగరంలో ఈ నెల 22 నుంచి జనవరి 5వ తేదీ వరకూ ‘సాక్షి’ఎంపిక చేసిన షోరూమ్‌ల్లో కొనుగోలు దారులకు అందజేసిన కూపన్లకు ప్రతిరోజూ లక్కీ డిప్ నిర్వహించి, విన్నర్‌కు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ఇంకెందుకు ఈ నెల 22 నుంచి సాక్షి పండుగ సంబరాలు నిర్వహిస్తున్న షోరూమ్‌లలో షాపింగ్ చేయండి.. లక్షాధికారులు కండి. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఎంజీ రోడ్డులోని కళానికేతన్ షోరూమ్‌లో ఘనంగా జరిగింది. కొనుగోలుదారుల హర్షధ్వానాల మధ్య నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ లాంఛనంగా లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను బ్రాంచి మేనేజర్ సూర్యనారాయణ వివరించారు. కళానికేతన్ ఎండీ వి.నాగభూషణం(చంటి), సాక్షి ఏజీఎం(యాడ్స్) వినోద్ మాదాసు, బ్యూరో ఇన్చార్జి టి.నాగభూషణం, రీజినల్ మేజేజర్ (యాడ్స్) సీహెచ్ అరుణ్‌కుమార్, బ్రాంచ్ డెప్యూటీ మేనేజర్ జె.ఎస్.ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు, కళానికేతన్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘వెలుగుబంటి’ కేసులో మరో నిందితుడి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మత్స్యశాఖ మాజీ కార్యనిర్వాహక ఇంజనీర్ వెలుగుబంటి సూర్యనారాయణపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన ప్రవాసభారతీయురాలు విజయలక్ష్మికి ఒడిశాతో పాటు రాష్ట్రంలోని కృష్ణపట్నంలో విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అనుమతి లభించింది. వీటికి రూ.400 కోట్లు సమీకరించుకోగా, మరో రూ.200 కోట్లు అవసరమవటంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ వెలుగుబంటి ఆమెను చెన్నైలో ఒక సమావేశానికి తీసుకువెళ్లారు. సుందర్రాజన్, సూర్యనారాయణ తదితరులు తాము రుణం ఇప్పిస్తామంటూ విజయలక్ష్మి నుంచి ముందస్తు చెల్లింపుల పేరుతో రూ.65 లక్షల వరకు తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సుందర్రాజన్ను అరెస్టు చేయగా ఆయన న్యాయస్థానం నుంచి బెయిల్ పొంది విడుదలయ్యాడు. మిగిలిన నిందితుల కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. సుందర్ రాజన్ నుంచి నేరానికి సంబంధించిన రూ.4 లక్షల నగదు సైతం రికవరీ చేశారు.