కాస్ట్‌లీ గురూ... | Kangana Ranaut gifts a Rs 2 crore flat to her yoga guru | Sakshi
Sakshi News home page

కాస్ట్‌లీ గురూ...

Published Mon, Feb 6 2017 11:28 PM | Last Updated on Wed, May 29 2019 2:59 PM

కాస్ట్‌లీ గురూ... - Sakshi

కాస్ట్‌లీ గురూ...

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె వార్తల్లో నిలవడం కామనే కదా? ఇందులో ప్రత్యేకత ఏంటి? అనుకునేరు. ఇప్పుడు నిలవడం ఓ ప్రత్యేకతే మరి. తన యోగా గురువు సూర్యనారాయణ సింగ్‌కు రెండు కోట్ల విలువైన ఫ్లాట్‌ గురుదక్షిణగా ఇచ్చి, బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు ఈ బ్యూటీ. 18 ఏళ్ల కిందట జుహూ బీచ్‌లో జిమ్నాస్టిక్స్‌ నేర్పుతున్న సూర్యనారాయణ.. కంగనాను ఆకట్టుకున్నారు. అప్పటికి ఈ అమ్మడు బాలీవుడ్‌ చిత్రసీమలోకి అడుగుపెట్టలేదు. అప్పడే ఆయన్ను తన యోగా గురువుగా స్వీకరించి, నాటి నుంచి నేటి వరకూ యోగా శిక్షణ తీసుకుంటున్నారు.

తన నుంచి ఏమీ ఆశించకుండా, తనకోసం ఇంత చేస్తున్న గురువుకు దక్షిణగా ఏదైనా ఇవ్వాలని ఫిక్స్‌ అయిన ఈ భామ యోగా కేంద్ర నిర్వహణకు వీలుగా ఉండేందుకు రెండు కోట్లు విలువ చేసే రెండు పడక గదుల ఇల్లు బహుమానంగా ఇచ్చారట. అది కూడా సెలబ్రిటీలు, ధనవంతులు ఉండే ముబై లోని అంధేరీ ప్రాంతంలో. యోగా శిక్షణకు అనువుగా ఉండేలా విశాలమైన బాల్కనీతో పాటు సకల సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ రెడీ చేయించారట కంగనా. ఏదేమైనా కంగనా గురుభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement