సాక్షి, కాకినాడ : ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆర్‌ఎంసీ ఆడిటోరియంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యకుడిగా రామ సూర్యనారాయణను, కార్యదర్శిగా ఆస్కరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుములల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని 13 జిల్లాలకు నూతన అధ్యక్ష, కార్యదర్శిల పేర్లను సంఘం అధ్యక్షుడు రామసూర్యనారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వ హయంలో సీఎం వద్ద భజన చేసిన కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ నూతన ముఖ్యమంత్రి వద్దకు చేరారని రామసూర్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment