జైపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వల్ల రాజస్థాన్ టూరిజంకు గణనీయమైన మేలు జరగడమే కాకుండా జైపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. జైపూర్‌లో గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తూ ఈ సాహిత్య వేడుక వల్ల ఎంత మంది ప్రముఖులు వచ్చి వెళతారో మిగతా సంవత్సరమంతా అంతమంది ప్రముఖులు వచ్చి వెళతారని ఆమె అన్నారు. భారీ సాహిత్య ఉత్సవాల వల్ల ప్రాంతీయ నగరాలకు గుర్తింపు, టూరిజం కార్యకలాపాల పెరుగుదల జరుగుతుందని తెలిపారు.
కాగా, జైపూర్‌లోని క్లార్క్ హోటల్‌లో విశేష సంఖ్యలో సాహితీ ప్రేమికుల మధ్య ఐదురోజుల లిటరేచర్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుక కోసం తరలి వచ్చారు. వీరిలో ముగ్గురు బుకర్‌ప్రైజ్ విజేతలు, ఐదుగురు పులిట్జర్ ప్రైజ్ విజేతలు ఉన్నారు. ఇతర భారతీయ భాషల సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
కాగా తెలుగు నుంచి కేవలం ఒకే ఒక స్పీకర్‌గా పరకాల ప్రభాకర్‌కు ఆహ్వానం అందింది. అది కూడా సాహిత్యాంశ కాకుండా రాజకీయాంశ మీద ఆయన మాట్లాడతారు. తెలుగులో మంచి సాహిత్యం ఉన్నా ఇంగ్లిష్ పాఠకులకు అనువాదాల ద్వారా తగినంతగా అందకపోవడం వల్లే ప్రతిసారీ ఈ ఉత్సవంలో చోటు దొరకడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment