cultural program
-
సాహిత్యం వల్ల టూరిజం అభివృద్ధి
జైపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వల్ల రాజస్థాన్ టూరిజంకు గణనీయమైన మేలు జరగడమే కాకుండా జైపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. జైపూర్‌లో గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తూ ఈ సాహిత్య వేడుక వల్ల ఎంత మంది ప్రముఖులు వచ్చి వెళతారో మిగతా సంవత్సరమంతా అంతమంది ప్రముఖులు వచ్చి వెళతారని ఆమె అన్నారు. భారీ సాహిత్య ఉత్సవాల వల్ల ప్రాంతీయ నగరాలకు గుర్తింపు, టూరిజం కార్యకలాపాల పెరుగుదల జరుగుతుందని తెలిపారు. కాగా, జైపూర్‌లోని క్లార్క్ హోటల్లో విశేష సంఖ్యలో సాహితీ ప్రేమికుల మధ్య ఐదురోజుల లిటరేచర్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుక కోసం తరలి వచ్చారు. వీరిలో ముగ్గురు బుకర్‌ప్రైజ్ విజేతలు, ఐదుగురు పులిట్జర్ ప్రైజ్ విజేతలు ఉన్నారు. ఇతర భారతీయ భాషల సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. కాగా తెలుగు నుంచి కేవలం ఒకే ఒక స్పీకర్‌గా పరకాల ప్రభాకర్‌కు ఆహ్వానం అందింది. అది కూడా సాహిత్యాంశ కాకుండా రాజకీయాంశ మీద ఆయన మాట్లాడతారు. తెలుగులో మంచి సాహిత్యం ఉన్నా ఇంగ్లిష్ పాఠకులకు అనువాదాల ద్వారా తగినంతగా అందకపోవడం వల్లే ప్రతిసారీ ఈ ఉత్సవంలో చోటు దొరకడం లేదు. -
తెలుగు సాహితి సదస్సు.. వక్తలకి ఆహ్వానం
కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి. కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి పెద్ద ఎత్తున టొరాంటో వేదికగా 2021 సెప్టెంబరు 25, 26 తేదీల్లో తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10:00 (EST) నుంచి సాయంత్రం 6:00 (EST) వరకు ఈ సదస్సు జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ సదస్సును వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా దేశాల వక్తల ప్రసంగ ఎంట్రీలను 2021 జులై 31 లోగా ఈ కింది ఈమెయిట్స్కి పంపాల్సి ఉంటుంది. sadassulu@gmail.com , vangurifoundation@gmail.com . ఈ సదస్సు నిర్వహాణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక (కెనడా), టొరంటో తెలుగు టైమ్స్ పత్రిక, ఆటవా తెలుగు సంఘం, తెలుగు వాహిని (సాహిత్య వేదిక, టొరంటో), అంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు కల్చురల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, కేల్గరీ తెలంగాణా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సదస్సు ఈ సందర్భంగా అమెరికా, కెనడా దేశాల నుంచి ఎంపిక అయిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారం అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
ఈ కుర్రాడు.. ఇక శతావధాని ఆదిత్యుడు
సాక్షి, రాజమహేంద్రవరం: లలితాదిత్యుడు మధ్యందిన మార్తాండుడిలా జాజ్వల్యమానంగా ప్రకాశించాడు. పృచ్ఛకవరేణ్యుల అక్షర అస్త్రశ్రస్తాలను అతి లాఘవంగా ఎదుర్కొన్నాడు. పద్యాలను ఛందోబద్ధంగా మాత్రమే కాదు, రసరమ్య గీతాలుగా, భావస్ఫోరకంగా చెప్పి పండితుల ఆమోదాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. ఆదికవి నన్నయ భట్టారకుడు, తిరుపతి వేంకట కవులు, కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటి హేమాహేమీలు నడయాడిన గడ్డ మీద.. అమెరికాలో జన్మించి, అక్కడే చదువు‘సంధ్య’లు సాగిస్తున్న ఈ నూనూగు మీసాల నూత్నయౌవనంలో ఉన్న కుర్రాడు మంగళవారం శతావధానం విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మహత్తర ఘటన తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారణంగా నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా ముక్తకంఠంతో పేర్కొన్నారు.. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, శుభోదయం ఇన్ఫ్రా సంయుక్త ఆధ్వర్యాన కళాశాలలో ఆదివారం ప్రారంభమైన శతావధానం నిర్వాహకుల అంచనాలకంటే ముందుగానే ఉదయం 11.43 గంటలకు ముగిసింది. ఘంటానాదం చేస్తున్న ధూళిపాళ శతావధానంలోని అంశాలు మూడు నిషిద్ధాక్షరులు, 24 సమస్యలు, 24 దత్తపదులు, 24 వర్ణనలు, 19 ఆశువులు, నాలుగు ఘంటావధానాలు, మూడు అప్రస్తుత ప్రసంగాలు వెరసి.. 101 అంశాలపై పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు యతిప్రాసలు చెడకుండా, రసాత్మకంగా లలిత్ ఆదిత్య పద్యాలను అలవోకగా అందించాడు. ‘శ్చి’, స్త్వం’ వంటి ప్రాసలతో పద్యాలు చెప్పవలసివచ్చినా అదరలేదు.. బెదరలేదు. ‘శిష్యవాత్సల్యము చెలువుమీర’ అవధాన ప్రాచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అవధానిని ప్రోత్సహిస్తూ, పృచ్ఛకులను కవ్విస్తూ, రసజ్ఞులను మెప్పిస్తూ అంతటా తానే అయి, అన్నీ తానే అయి అవధాన క్రతువు నిర్వహించారు. అవధానిని ‘అవధాన శరచ్చంద్ర’ బిరుదుతో సత్కరించారు. 25 నిమిషాల్లో 75 పద్యాలు మూడు రోజులుగా పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తాను పద్యరూపంగా ఇచ్చిన సమాధానాలను సాయంత్రం జరిగిన మహాధారణలో లలిత్ ఆదిత్య 25 నిమిషాలలో చదివాడు. ‘గురువులయ్యె గురువుల దీవెనల్, లఘువులయ్యె నాదు శ్రమల్’ అని గురువులను స్తోత్రం చేశాడు. ఇది సరికొత్త రికార్డు అని మహాదేవమణి శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. మహామహోపాధ్యాయులు, సంస్కృత శతావధానులు కొలువు తీరిన సభలో ఆదిత్య మహాధారణకు కరతాళధ్వనులు ఆగకుండా మోగాయి. పూరి, గారె, వడ, దోసెలతో వాతావరణ కాలుష్యంపై పద్యం చెప్పమని సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు కోరగా.. అవధాని ఇలా చెప్పారు. ‘పూరి’త మయ్యె ముజ్జగము భూస్థితి భంగ రసాయనంబులన్ దూరినభ్యాదతన్‌గొనగ ‘దోసి’ళు లొగ్గిన వారు లేరు పొం ‘గారె’ను బాష్పముల్ కువలయాంగనకున్ కలుషమ్ము మీరగా ఆరయచిత్తకంధి ‘వడ’వాగ్నిగ రేగెను దిర్నివారమై.. పండితుల ప్రశంసలు ధార, ధారణ, పూరణ అవధానానకి ప్రాణాలు. శీలసంపద లేని పాండిత్యం, హారతి లేని పూజ, పూలు తలలో లేని మగువ కొప్పు, ధారణ లేని అవధానం వ్యర్థం. ధారణలో లలిత్ సందీప్ అసామాన్యమైన ప్రతిభ చూపాడు. – ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అత్యద్భుత ప్రతిభ లలిత్ ఆదిత్యుని ప్రతిభ అద్భుతం. దేవీదత్తం, ఉపాసనాసిద్ధి పొందిన లక్షణాలు అవధానిలో కనిపిస్తున్నాయి. – మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ పురాకృత సుకృతం పద్యవిద్యలో లలిత్ ఆదిత్య సాధించిన ప్రతిభ పురాకృత సుకృతం. గురువుల ఆశీస్సులను మెండుగా అందుకున్న లలిత్ ఆదిత్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను. – చింతలపాటి శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత -
‘అభ్యాస’ వార్షికోత్సవ వైభవం
-
హైదరాబాద్‌లో విదేశీ వనితల సందడి
-
‘డీకేడబ్ల్యూ’లో ఫ్రెషర్స్ డే
నెల్లూరు(టౌన్): డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ప్రిన్సిపల్ శైలజ, డిప్యూటీ వార్డెన్ రవీంద్రమ్మ, వైస్ ప్రిన్సిపల్ ఉదయ్‌భాస్కర్, కమిటీ సభ్యులు ఆల్మాస్బేగం, పద్మప్రియ, పీఆర్ఓ జోజీ, మేనేజర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో అమ్మాయిలు, నర్సుల నిర్వాకం
ముంబై: ముంబై మహానగరంలో ఆస్పత్రులు రద్దీగా ఉంటాయి. ముంబైతో పాటు సుదూర ప్రాంతాల నుంచి నిత్యం చికిత్స కోసం ప్రజలు వస్తుంటారు. రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఆస్పత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడటం వైద్య సిబ్బంది బాధ్యత. అలాంటిది ముంబైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మ్యూజిక్, డాన్స్‌లతో హోరెత్తించారు. సిబ్బంది ఆస్పత్రిని ఏకంగా ఫంక్షన్ హాల్లా మార్చేశారు. ఆస్పత్రిలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి మైనర్ అమ్మాయిలతో డాన్స్‌లు చేయించారు. పెద్దగా సౌండ్ వచ్చేలా పాటలు పెట్టి మరీ డాన్స్ చేయించారు. చిన్నపిల్లలతో పాటు నర్సులు, మహిళలు డాన్స్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యం కలుగుతుందన్న స్పృహకూడా లేకుండా సంబరాలు చేసుకున్నారు. వైద్య సిబ్బంది నిర్వాకం చూసి రోగులు అవాక్కయ్యారు. డాన్స్ చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా తతంగం ఏ ఆస్పత్రిలో ఎప్పుడు జరిగిందన్న వివరాలు తెలియరాలేదు.