సౌదీలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మొత్తం భారతదేశంలోకెల్లా ఎక్కువగా ప్రవాసీయుల సంక్షేమానికి వైఎస్ జగన్ సర్కారే పెద్ద పీఠం వేస్తుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పెర్కోన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా భీమా పథకం విజయవంతంగా అమలవుతుందని తద్వారా అకాల మరణం పాలైన అనేక మంది ఆభాగ్యులకు ఆపన్నహస్తం లభిస్తుందని ఆయన అన్నారు. మక్కా యాత్రకు వచ్చిన అంజద్ బాషా జెద్ధాలో తనను కలిసిన ప్రవాసీయులను, సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) ప్రతినిధులతో మాట్లాడుతూ.. దేశంలో ఆదర్శవంతంగా ప్రచారంలో ఉన్న కేరళ రాష్ట్రం కంటె కూడ మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఏపీ ఎన్నార్టీ సంస్ధ పని చేస్తుందని అన్నారు.
కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలలో ఏపీ ఎన్నార్టీ సంస్ధ చురుక్కుగా ఉందని ఆయన అన్నారు. విదేశాలలో తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండాలని, ఇక్కడ కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగుతనంతో కలుపుకోలుగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కుల,మత, ప్రాంతీయ విబేధాలకు అతీతంగా ఇక్కడ తెలుగువారు కలిసిఉండి, భారతీయ ప్రతిష్ఠను పెంపొందించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో సాటా పని తీరును వివరించగా ఆయన వారిని అభినందించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శివ సైమన్ పీటర్, రాంబాబు, శాంతి, శ్రీమతి నాగరాజు, ఫైజ్, ఖాదర్ వలీలు ఉన్నారు. తన పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సౌదీలోని దక్షిణ ప్రాంతంలోని ఆభాలో సాటా అధ్వర్యంలో జరిగిన భారతీయ సమ్మేళాన్ని కూడా వీడియో కాల్ ద్వారా సంబోధించారు.
(చదవండి: యూఎస్‌ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం)
Comments
Please login to add a commentAdd a comment