![DK Shivakumar On High Command Announced Deputy CM Post - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/18/DK-Shivakumar-On-High-Command-Announced.jpg.webp?itok=IQ5TfQmH)
ఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం తనను ఎంపిక చేయడంపై డీకే శివకుమార్‌ను స్పందించారు. అధిష్టాన నిర్ణయం కోర్టు తీర్పులాంటిదని, కాబట్టి దానిని అంగీకరించక తప్పదని వ్యాఖ్యానించారు.
‘‘నిర్ణయాన్ని పూర్తిగా హైకమాండ్‌కు వదిలేశాం. అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని హైకమాండ్ భావించింది. కాబట్టి హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’’ అని శివకుమార్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఐదు రోజుల సస్పెన్స్ తర్వాత.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను అధిష్టానం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వరకు శివకుమార్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: శివకుమార్‌ను ఒప్పించడంలో సోనియా కీ రోల్
Comments
Please login to add a commentAdd a comment