సాక్షి, పశ్చిమ గోదావరి : టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు టైలర్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. అందరికీ ఆరోగ్య శ్రీ వర్తింపు, అర్హులైన వృద్ధులకు పెన్షన్ సౌకర్యం వంటి సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. టైలర్ల సంఘానికి కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు బాధ్యత తీసుకుంటానని ఆళ్ల నాని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment